ఆమె ప్రతిఘటించడంతో… తీవ్రంగా కొట్టి… ఆపై తోసివేసి

విశాఖలోని అరకులోయ మండలానికి చెందిన యువతి (19) గత కొద్దికాలంగా అచ్యుతాపురంలోని జంగులూరు జంక్షన్‌ దగ్గర ఒక ఆపార్టుమెంటులో భవన నిర్మాణ కార్మికురాలిగా పనిచేస్తున్నది. అదే చోట శ్రీకాకుళం జిల్లాకు చెందిన బాణాల సురేష్‌ (23) తాపీ మేస్త్రిగా పనిచేస్తున్నాడు. సురేష్‌ ఆమెను లోబరచుకోవడానికి చాలా కాలంగా ప్రయత్నిస్తున్నాడు. కానీ ఆమె నిరాకరిస్తూ వస్తోంది. బుధవారం రాత్రి యువతిని బలవంతం చేయబోగా ప్రతిఘటించింది. దీంతో కోపోద్రిక్తుడైన సురేష్‌… ఆమెను తీవ్రంగా కొట్టి మెట్లపై నుంచి తోసేశాడు. తీవ్రంగా […]

  • Tv9 Telugu
  • Publish Date - 3:46 pm, Sat, 1 June 19
ఆమె ప్రతిఘటించడంతో... తీవ్రంగా కొట్టి... ఆపై తోసివేసి

విశాఖలోని అరకులోయ మండలానికి చెందిన యువతి (19) గత కొద్దికాలంగా అచ్యుతాపురంలోని జంగులూరు జంక్షన్‌ దగ్గర ఒక ఆపార్టుమెంటులో భవన నిర్మాణ కార్మికురాలిగా పనిచేస్తున్నది. అదే చోట శ్రీకాకుళం జిల్లాకు చెందిన బాణాల సురేష్‌ (23) తాపీ మేస్త్రిగా పనిచేస్తున్నాడు. సురేష్‌ ఆమెను లోబరచుకోవడానికి చాలా కాలంగా ప్రయత్నిస్తున్నాడు. కానీ ఆమె నిరాకరిస్తూ వస్తోంది. బుధవారం రాత్రి యువతిని బలవంతం చేయబోగా ప్రతిఘటించింది. దీంతో కోపోద్రిక్తుడైన సురేష్‌… ఆమెను తీవ్రంగా కొట్టి మెట్లపై నుంచి తోసేశాడు. తీవ్రంగా గాయపడిన ఆమెను అనకాపల్లి ఎన్టీఆర్‌ ఆసుపత్రిలో చేర్చారు. పరిస్థితి విషమించడంతో విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ యువతి మృతిచెందినట్టు ఎస్‌ఐ జి.లక్ష్మణరావు తెలిపారు. ఈ ఘటనపై ఎలమంచిలి సీఐ విజయనాథ్‌ శుక్రవారం విచారణ చేపట్టారు. సురేష్‌పై అట్రాసిటీ, అత్యాచారం, హత్య కేసులను నమోదు చేశారు.