NTR District: ముక్క, మందు లేవలి అలిగి వెళ్లిపోయిన అల్లుడు.. ఆ తర్వాతే అసలు ట్విస్ట్

ఎన్టీఆర్ జిల్లాలోని మక్కపేటలో జరిగిన విషాద ఘటనలో రేష్మ అనే మహిళ అనుమానాస్పదంగా చనిపోయింది. వత్సవాయి గ్రామానికి చెందిన సైదులుతో వివాహమైంది. రాఖీ పండుగ సందర్భంగా మక్కపేటకు వచ్చిన సైదులు, అత్తారింటి నుండి అలిగి తిరిగి వెళ్లిపోయాడు. ఆ తర్వాత నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి.

NTR District: ముక్క, మందు లేవలి అలిగి వెళ్లిపోయిన అల్లుడు.. ఆ తర్వాతే అసలు ట్విస్ట్
Reshma Saidulu

Edited By: Ram Naramaneni

Updated on: Aug 24, 2025 | 1:18 PM

ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా జరిగిన ఘటన ఇది. రూరల్ ప్రాంతమైన మక్కపేటకు చెందిన రేష్మ, వత్సవాయి గ్రామానికి చెందిన సైదులును పెళ్లాడింది. ఇద్దరికీ ఇది రెండో వివాహమే. దంపతులకు ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. సజావుగా సాగిపోతున్న ఈ కుటుంబ జీవితం ఒక్కసారిగా తారుమారు అయ్యింది. రాఖీ పండుగ సందర్భంగా సోదరుడికి రాఖీ కడతానంటే సైదులు భార్య రేష్మను తీసుకుని వత్సవాయి నుంచి మక్కపేటకు వచ్చాడు. అయితే అత్తారింటి వారు తనకు సరిగ్గా మర్యాదలు చేయలేదని.. మాసం వండలేదని, మందు పోయలేదని అలిగి వెళ్లిపోయాడు.  తరువాత రేష్మను భర్త దగ్గరికి వెళ్ళమని, ఆమె తల్లి తండ్రులు ఎన్నిసార్లు కోరినప్పటికీ, రేష్మ అక్కడకు వెళ్లకపోయింది.

తరువాత, రేష్మ తల్లి తండ్రులు కూతుర్ని ఒప్పించి, భర్త వద్దకు పంపారు. 21వ తేదీ రేష్మను ఆటో ద్వారా సైదులు దగ్గరకు పంపించారు తల్లిదండ్రులు. అయితే 22వ తేదీన సాయంత్రం వత్సవాయి మోడల్ కాలనీలో రోడ్డు పక్కన ఉన్న పొలం బావిలో రేష్మ శవమై తేలింది. అయితే సాయంత్రం కూతురికి ఫోన్ చేసిన తల్లితండ్రులు అల్లుడు దగ్గరికి వెళ్ళావా అని అడిగితే తాను మందులు తీసుకొని వెళ్తున్నానని చెప్పి.. ఆపై అదృశ్యమయింది. కట్ చేస్తే ఇలా శవమై కనిపించింది.  అయితే రేష్మ మరణవార్త తెలిసిన వెంటనే సైదులు కూడా అదృశ్యమవ్వడం పలు అనుమానాలకు తావిస్తోంది. భార్య ఆత్మహత్య చేసుకుందన్న భయంతో ఎక్కడికైనా వెళ్లాడా.. లేక భార్యపై మమకారంతో తాను కూడా ఏదైనా అఘాయుత్యంకి పాల్పడ్డాడా అన్న కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..