Andhra pradesh Govt: ఏపీలో స్థానిక సంస్థ ఎన్నికలు.. రాష్ట్ర ప్రభుత్వం, ఎస్ఈసీ మధ్య కొనసాగుతున్న రగడ..

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ అంశంపై రాష్ట్ర ఎన్నికల సంఘం, ప్రభుత్వం మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది. తాజాగా..

Andhra pradesh Govt: ఏపీలో స్థానిక సంస్థ ఎన్నికలు.. రాష్ట్ర ప్రభుత్వం, ఎస్ఈసీ మధ్య కొనసాగుతున్న రగడ..
Follow us

|

Updated on: Dec 22, 2020 | 11:22 PM

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ అంశంపై రాష్ట్ర ఎన్నికల సంఘం, ప్రభుత్వం మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది. తాజాగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ వివాదంపై ఏపీ హైకోర్టులో నేడు విచారణ జరిగింది. కరోనా వ్యాక్సినేషన్ పేరుతో ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలను అడ్డుకుంటోందని ఎస్ఈసి తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు. వ్యాక్సినేషన్‌కు షెడ్యూల్ రిలీజ్ చేయకుండానే వ్యాక్సినేషన్ అని ఎలా చెబుతారని ఎస్ఈసీ తరఫు న్యాయవాది ప్రశ్నించారు. దీనికి స్పందించిన ప్రభుత్వ తరఫు లాయర్.. కరోనా కారణంగా తాము ఎన్నికలు నిర్వహించలేమని తేల్చి చెప్పారు. ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం.. కేసు విచారణను సంక్రాంతి సెలవుల అనంతరం విచారిస్తామని ప్రకటించింది. కాగా, అప్పటి వరకు ఎన్నికల కమిషన్ ప్రొసీడింగ్స్ పై ‘స్టే’ విధించాలని ప్రభుత్వం తరఫున న్యాయవాది కోర్టును కోరారు. అయితే ‘స్టే’ ఇచ్చేందుకు వీలు లేదని ఎస్ఈసీ తరఫున లాయర్ వాదించారు. దాంతో బుధవారం నాడు పూర్తిస్థాయిలో కేసు విచారిస్తామని న్యాయస్థానం ప్రకటించింది.

Also read:

Kilauea Volcano Explosively : హవాయిలోని బద్దలైన కిలాయియా అగ్నిపర్వతం.. ఉవ్వెత్తున ఎగిసిన అగ్ని కీలలు..

Farmers Protest : హర్యానా ముఖ్యమంత్రి‌కు చేదు అనుభవం.. మనోహర్‌లాల్‌ కట్టర్ కాన్వాయ్‌ను అడ్డుకున్న రైతులు