Loan App: ప్రముఖులకూ తప్పని లోన్ యాప్ వేధింపులు.. ఏకంగా మంత్రికే ఫోన్ చేసి..

Loan App: లోన్ యాప్ నిర్వాహకుల ఆగడాలు రోజు రోజుకు శృతిమించిపోతున్నాయి. సామాన్యులనే కాదు.. ప్రముఖులకూ తప్పడం లేదు..

Loan App: ప్రముఖులకూ తప్పని లోన్ యాప్ వేధింపులు.. ఏకంగా మంత్రికే ఫోన్ చేసి..
Loan Apps
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Jul 30, 2022 | 7:42 AM

Loan App: లోన్ యాప్ నిర్వాహకుల ఆగడాలు రోజు రోజుకు శృతిమించిపోతున్నాయి. సామాన్యులనే కాదు.. ప్రముఖులకూ తప్పడం లేదు లోన్ యాప్ వేధింపులు. తాజాగా ఆంధ్రప్రదేశ్ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఫోన్‌కు లోన్ యాప్ ఏజెంట్ల నుంచి కాల్స్ వచ్చాయి. లోన్ ఈఎంఐ చెల్లించాలంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. మంత్రి కాకాని పర్యటనలో ఉండగా.. ఆయన పీఏ శంకర్ ఫోన్ లిఫ్ట్ చేశారు. లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులు తాళలేక రూ 25 వేలు చెల్లించారు శంకర్. మళ్లీ కాల్స్ వస్తుండటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కంప్లైంట్ నమోదు చేసుకున్న పోలీసులు.. ఫోన్ కాల్స్ చెన్నై నుంచి వస్తున్నట్లుగా గుర్తించారు. నలుగురు రికవరీ ఏజెంట్లను అరెస్ట్ చేశారు పోలీసులు. మంత్రి కాకానికే కాదు.. మరికొందరు ప్రజాప్రతినిధులకు కూడా ఈ లోన్ యాప్ నిర్వాహకులు వేధింపులకు గురి చేస్తున్నట్లు సమాచారం. పలువురు ఎమ్మెల్యేలకు ఫోన్ చేసి వారిని బెదిరించారు. వాస్తవానికి అశోక్ కుమార్ అనే వ్యక్తి ఆన్‌లైన్ లోన్ యాప్ ద్వారా రూ. 9 లక్షల రుణం తీసుకున్నాడు. అయితే, అశోక్ మొబైల్ కాంటాక్ట్ లిస్ట్‌లో ఉన్న వారికి యాప్ నిర్వాహకులు ఫోన్ కాల్స్ చేసి వేధిస్తున్నారు. వీరి వేధింపుల వ్యవహారాన్ని ఏపీ పోలీసులు సీరియస్‌గా తీసుకుని, యాక్షన్ ప్లాన్ మొదలు పెట్టారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.