Rain Alert: ప్రజలకు రెయిన్ అలర్ట్.. వచ్చే 3 రోజులు ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్

|

Sep 25, 2024 | 3:52 PM

బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాలతోపాటు.. పలు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ తరుణంలో భారత వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది.. వచ్చే మూడు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది.

Rain Alert: ప్రజలకు రెయిన్ అలర్ట్.. వచ్చే 3 రోజులు ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్
Rain Alert
Follow us on

బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాలతోపాటు.. పలు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ తరుణంలో భారత వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది.. వచ్చే మూడు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. పశ్చిమ మధ్య, దానిని ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతం ఉత్తరాంధ్ర-దక్షిణ ఒడిశా తీర ప్రాంతాల్లో ఏర్పడిన నిన్నటి అల్పపీడనము పశ్చిమ వాయవ్య దిశగా పయనించి ఈరోజు తక్కువగా గుర్తించినట్లు వాతావరణ శాఖ పేర్కొంది. అయితే, దీని అనుబంధ ఉపరితల ఆవర్తనం ప్రస్తుతం దక్షిణ ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టానికి 5.8 కి.మీ.ల ఎత్తు వరకు విస్తరించి ఎత్తుకు వెళ్ళేకొలది దక్షిణం వైపునకు వంగి ఉంటుంది. ఉత్తర కొంకణ్ నుంచి దక్షిణ బంగ్లాదేశ్ వరకు ఉపరితల ద్రోణి దక్షిణ ఛత్తీస్గఢ్ అంతర్భాగముగా సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఎత్తుకు వెళ్ళేకొలది దక్షిణం వైపునకు వంగి ఉంటుంది. షియర్ జోన్ లేదా గాలులకోత ఉత్తర భారతదేశ ద్వీపకల్పములో సుమారు 16°ఉత్తర అక్షాంశం వెంబడి సగటు సముద్రమట్టానికి 3.1 కి.మీ నుండి 7.6 కి.మీ ఎత్తులో విస్తరించి, ఎత్తుకు వెళ్ళేకొలది దక్షిణం వైపు వంగి పైన చెప్పబడిన ద్రోణితో విలీనమైనది. వీటి ప్రభావంతో వచ్చే మూడు రోజులు ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.. రాబోవు మూడు రోజులకు వాతావరణ సూచనలు ఎలా ఉన్నాయో చూడండి..

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం:-

బుధవారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు చాలా చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.

గురువారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.

శుక్రవారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.

దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్ ;-

బుధవారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు చాలాచోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.

గురువారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.

శుక్రవారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షము కొన్నిచోట్ల కురిసే అవకాశముంది. బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.

రాయలసీమ:-

బుధవారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేకచోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.

గురువారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్నిచోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.

శుక్రవారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షము ఒకటి లేదా రెండుచోట్ల కురిసే అవకాశముంది. బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..