Students Fight: బస్సులో సీటు కోసం స్ట్రీట్ ఫైట్.. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో రోడ్డుపై తన్నుకున్న విద్యార్థులు..

ఎమ్మిగనూరులోని ఓ ప్రైవేటు జూనియర్ కాలేజ్‌ ముందు రణరంగమే కనిపించింది. ఆర్టీసీ బస్సులో సీటు విషయంలో స్టూడెంట్స్‌కు, వేరేవాళ్లకు మధ్య మాటతేడా..

Students Fight: బస్సులో సీటు కోసం స్ట్రీట్ ఫైట్.. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో రోడ్డుపై తన్నుకున్న విద్యార్థులు..
Students Fight
Follow us

|

Updated on: Oct 20, 2022 | 7:24 PM

ఆర్టీసీ బస్సులో సీటు దగ్గర గొడవ మొదలైంది. మాటామాటా అనుకున్నారు. నువ్వెంత అంటే.. నువ్వెంత అనే వరకు వ్యవహారం వెళ్లింది. కట్‌చేస్తే.. నడిరోడ్డుపై కొట్లాట. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో జరిగిందీ ఘటన. ఎమ్మిగనూరులోని ఓ ప్రైవేటు జూనియర్ కాలేజ్‌ ముందు రణరంగమే కనిపించింది. ఆర్టీసీ బస్సులో సీటు విషయంలో స్టూడెంట్స్‌కు, వేరేవాళ్లకు మధ్య మాటతేడా వచ్చింది. ఎమ్మిగనూరు చేరుకున్నాక విద్యార్థులు కాలేజ్‌కు వచ్చారు. అవతలివాళ్లూ వెళ్లిపోయారు. కట్‌చేస్తే.. కాసేపటికి రెండు గ్రూపులు తన్నుకున్నాయి. రాళ్లు రువ్వుకున్నారు. వెంట తెచ్చుకున్న కర్రలతో దాడులు చేసుకున్నారు.

సినియాలో ఫైటింగ్ సీన్ తలపించేలా పోటా పోటీగా దాడి చేసుకున్నారు. రోడ్డుపై పరుగులు తీస్తూ కొట్టుకుంటుండంతో కాసేపు అక్కడివారికి అర్థం కాలేదు.. చూస్తుండగానే సీన్ పూర్తిగా మారిపోయింది. వీరి స్ట్రీట్ ఫైట్‌తో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. ఒక్కసారిగా అక్కడి వాతావరణాన్ని భయానకంగా మార్చేశారు.

ఇంటర్ స్టూడెంట్స్‌, బయటి వ్యక్తులకు జరిగిన దాడిలో పలువురు గాయపడ్డారు. కొందరికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనాస్థలానికి చేరుకొన్న పోలీసులు.. రెండు వర్గాలను చెదరగొట్టారు. గొడవ జరిగిన రెండు వర్గాల వారిని పిలిచి విచారణ చేస్తున్నారు.

మరిన్ని ఏపీ న్యూస్ కోసం