Devaragattu Bunny Festival 2021: బన్నీ ఉత్సవానికి అంతా రెడీ.. ప్రశాంతంగా నిర్వహించుకునేలా గ్రామాల్లో పోలీసుల ప్రచారం..

భక్తుల్లో భక్తి కట్టలు తెంచుకుంటుంది. కర్రలు స్వైర విహారం చేస్తాయి. ఉత్సవమూర్తుల కోసం వేలాది మంది సమరానికి సై అంటారు. దేవరగట్టుకొండ ప్రాంతంలోని 11 గ్రామాల ప్రజలు..

Devaragattu Bunny Festival 2021:  బన్నీ ఉత్సవానికి అంతా రెడీ.. ప్రశాంతంగా నిర్వహించుకునేలా గ్రామాల్లో పోలీసుల ప్రచారం..
Devaragattu Bunny Festival
Follow us

|

Updated on: Oct 11, 2021 | 2:27 PM

కళ్ళలో భక్తి… కర్రల్లో పౌరుషం… వెరసి రక్తాభిషేకం..! అదే దేవరగట్టు బన్నీ ఉత్సవం..! ప్రతి ఏటా భక్తి పేరుతో విజయదశమి రోజు కర్రల సమరం జరుగుతుంది. కర్రలు కరాళ నృత్యం చేస్తాయి. కర్నూలు జిల్లాలో బన్నీ ఉత్సవానికి పెద్ద చరిత్రే ఉంది. దసరా వచ్చిందంటే అక్కడి భక్తుల్లో భక్తి కట్టలు తెంచుకుంటుంది. కర్రలు స్వైర విహారం చేస్తాయి. ఉత్సవమూర్తుల కోసం వేలాది మంది సమరానికి సై అంటారు. దేవరగట్టుకొండ ప్రాంతంలోని 11 గ్రామాల ప్రజలు సంప్రదాయబద్ధంగా ఈ ఉత్సవాన్ని జరుపుకుంటున్నారు. దసరా పండుగ రోజు అర్థరాత్రి కొండపై ఉన్న మాలమల్లేశ్వస్వామికి కళ్యాణం జరుగుతుంది. అనంత మాల సహిత మల్లేశ్వరస్వామి విగ్రహాలను పల్లకిలో ఊరేగింపుగా తీసుకెళ్తారు. ఆ విగ్రహాలకు మూడు గ్రామాల ప్రజలు రక్షణగా నిలుస్తారు. ఒక వర్గం వారు విగ్రహాల్ని తీసుకు వెళ్తుంటే.. మరో వర్గం వారిని ఆపే ప్రయత్నం చేస్తారు. ఇలా రెండు వర్గాల మధ్య కర్రల సమరం నడుస్తుంది. అనంతరం విగ్రహాల్ని తిరిగి దేవరగట్టు మీద ఉంచటంతో ఉత్సవం పూర్తి అవుతుంది. ఇందులో వందలాది మంది తలలు పగులుతాయి. అయినా లెక్క చేయకుండా కర్రల సమరానికి సై అంటారు. ఈసారి బన్నీ ఉత్సవాలను ఈనెల 21 నుంచి 30 వరకు నిర్వహించాలని మొదట నిర్ణయించారు.

రక్తతర్పణతోనే స్వామి శాంతిస్తాడనే నమ్మకం. అందుకే, దసరా రోజు కర్రలు కరాళ నృత్యం చేస్తాయి. దసరా అంటే దేశమంతా సంబరం, కానీ దేవరగట్టులో మాత్రం సమరం. ఒళ్లు విరుచుకునే వీరావేశం. కళ్లల్లో భక్తి, కర్రల్లో పౌరుషం. టెంకాయల్లా తలల్ని పగలుకొట్టుకునే ఆచారం. దసరా రోజు జరిగే కర్రల యుద్ధంలో వందల మంది తలలు పుచ్చకాయల్లా పగిలిపోనున్నాయి. ఎప్పటిలాగే, కర్రల సమరానికి దేవరగట్టు రెడీ అవుతోంది. మాలమల్లేశ్వరస్వామి కోసం దాదాపు 11 గ్రామాల ప్రజలు యుద్ధానికి సిద్ధమవుతున్నారు.

అయితే, అధికారులు, పోలీసులు కూడా కర్రల సమరాన్ని ఆపేందుకు ఎప్పటిలాగే ప్రయత్నాలు ప్రారంభించారు. ఈసారి కూడా 2వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. పోలీసులే రెండు వేల మంది ఉంటే ఇక జనం ఏ రేంజ్‌ వస్తారో మీరే ఊహించుకోండి.

ఇవి కూడా చదవండి: Shiba Inu: బిట్ కాయిన్‌ను మించి పరుగులు.. 260 శాతం పెరిగిన శిబా ఇను.. మీరు కూడా..

Income Tax: ఇంట్లో ఎంత బంగారం దాచుకోవచ్చు.. చట్టం ఏం చెబుతోంది.. పూర్తి వివరాలు..

Viral Video: ఇది మామూలు మార్జాలం కాదురో.. స్పైడర్‌మాన్‌లా గోడపై పరుగులు పెట్టిన పిల్లి..

ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?