Pawan Kalyan Anantapur Tour: కౌలురైతుకు భరోసా.. నేడు అనంత నుంచి పవన్ పర్యటన షురూ..!

Janasena Yatra: కౌలురైతుకు భరోసా..! జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ ఆత్మహత్యలు చేసుకున్న రైతులకు ఆర్థికసాయం అందించేందుకు నడుం బిగించారు.

Pawan Kalyan Anantapur Tour: కౌలురైతుకు భరోసా.. నేడు అనంత నుంచి పవన్ పర్యటన షురూ..!
Pawan Kalyan
Follow us

|

Updated on: Apr 12, 2022 | 5:48 AM

Janasena Yatra: కౌలురైతుకు భరోసా..! జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ ఆత్మహత్యలు చేసుకున్న రైతులకు ఆర్థికసాయం అందించేందుకు నడుం బిగించారు. ఇవాళ అనంతపురంజిల్లా నుండి కౌలురైతుల భరోసా యాత్రను జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా ఏపీలోని అనంతపురంజిల్లా నుంచి ఆత్మహత్యలు చేసుకున్న కౌలురైతులకు ఆర్థికసాయం అందించి.. వారి కుటుంబాల్లో ధైర్యం నింపడానికి తలపెట్టిన ఈ యాత్రను చేపట్టారు. పవన్‌ కళ్యాణ్ ఇవాళ ఉదయం 9 గంటలకు పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకొని అక్కడి నుంచి కొత్త చెరువు గ్రామానికి చేరుకుంటారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. కొత్తచెరువు గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న కౌలురైతు కుటుంబాన్ని పవన్‌కల్యాణ్‌ పరామర్శించి ఆర్థికసాయం అందించనున్నారు. ఆ తర్వాత ధర్మవరానికి చేరుకొని మరో బాధిత రైతు కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం అందిస్తారు. ఇక ఉదయం 11.20 గంటలకు ధర్మవరం రూరల్‌లోని గొట్లూరుకి చేరుకొని ఆత్మహత్య చేసుకున్న మరో కౌలురైతు కుటుంబాన్ని పరామర్శించి వారికి ఆర్థిక సాయం అందిస్తారు పవన్‌కల్యాణ్‌.

ఆ తర్వాత పవన్‌కల్యాణ్‌ అనంతపురం రూరల్ మండలంలోని పూలకుంట గ్రామంలో ఇటీవల ఆత్మహత్యకు పాల్పడిన యువ రైతు కుటుంబాన్ని పరామర్శించనున్నారు. వారి కుటుంబానికి అండగా నిలబడడానికి ఆర్ధిక సహాయం అందజేస్తారు. ఇక ఇదే మండలంలోని మన్నీల గ్రామాన్ని కూడా పవన్‌ సందర్శిస్తారు. ఈ గ్రామంలో ఆత్మహత్యకు పాల్పడిన ఇద్దరు కౌలు రైతుల కుటుంబాలకు ఆర్ధిక సహాయం అందజేస్తారు. ఆ తర్వాత రచ్చబండ కార్యక్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు. ఇక్కడ జిల్లాలో ఆత్మహత్యకు పాల్పడిన మరికొందరు కౌలు రైతుల కుటుంబాలకు ఈ సభలో ఆర్ధిక సహాయం అందచేసి వారి కుటుంబ పరిస్థితులు తెలుసుకుంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.

Also read:

IPL 2022: వరుసగా రెండో మ్యాచ్‌ గెలిచిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌.. కెప్టెన్‌ ఇన్సింగ్స్‌ ఆడిన విలియమ్సన్..

Investment: ఇన్వెస్ట్మెంట్స్ చేయడంలో మహిళలు ఎందుకు వెనకబడుతున్నారు.. కారణమేంటంటే..

విద్యార్ధులకు అలర్ట్! TSRJC CET 2022 దరఖాస్తు గడువు పెంపు! ఎప్పటివరకంటే..