Andhra Pradesh: అలా చేయడం వల్లే రాష్ట్రం విడిపోయింది.. తెలంగాణ ఉద్యమంపై పవన్ కీలక వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజల భాగస్వామ్యం లేకుండా ప్రభుత్వాలు నిలబడవని, కులమతాల ప్రస్తావన లేని రాజకీయాలు రావాలని ఆకాంక్షించారు. మంగళగిరిలో (Mangalagiri) పార్టీ...

Andhra Pradesh: అలా చేయడం వల్లే రాష్ట్రం విడిపోయింది.. తెలంగాణ ఉద్యమంపై పవన్ కీలక వ్యాఖ్యలు
Pawan Kalyan
Ganesh Mudavath

|

Jul 02, 2022 | 8:47 PM

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజల భాగస్వామ్యం లేకుండా ప్రభుత్వాలు నిలబడవని, కులమతాల ప్రస్తావన లేని రాజకీయాలు రావాలని ఆకాంక్షించారు. మంగళగిరిలో (Mangalagiri) పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. వేర్వేరు ప్రాంతాలు, కులాల మధ్య నుంచి ఒక చోటుకు వచ్చి ఒకేలా ఆలోచించాలంటే కష్టసాధ్యమైందని, ఒకరి భాష, యాసను మరొకరు గౌరవించుకోవాలని సూచించారు. తమ భాష, యాసను గౌరవించడం లేదనే తెలంగాణ ఉద్యమం మొదలైందని అన్నారు. ప్రాంతీయతను గుర్తించకపోతే జాతీయ వాదం రాదన్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో టీడీపీకి, తెలంగాణలో టీఆర్ఎస్ ప్రజలు అవకాశమిచ్చారని వెల్లడించారు. ప్రజల భాగస్వామ్యం లేకుండా ఏర్పడే ప్రభుత్వాలు నిలబడవన్న పవన్.. జరుగుతున్న విధ్వంసాన్ని సరిచేస్తూ అభివృద్ధి చేయాలని చెప్పారు. ఏ పార్టీ ప్రారంభమైనా చిన్నగానే ఉంటుందని, జనసేన కూడా అలాంటిదేనని వివరించారు. ప్రస్తుత రాజకీయాల్లో పురుషుల ఆధిక్యమే ఉందన్న పవన్.. జనసేన పార్టీలో మహిళలను చైతన్యవంతులు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు.

జనసేన అధికారంలోకి రాగానే జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటిస్తామని గతంలో పవన్ కల్యాణ్ ప్రకటించారు. లక్షకోట్లు దోపిడీ చేసే సత్తా వైసీపీ వాళ్లకు ఉన్నప్పుడు రెండున్నర లక్షల ఉద్యోగాలు తెచ్చే సత్తా జనసేనకు ఎందుకు ఉండదని అన్నారు. చాలాసార్లు ఇతరులకు అవకాశం ఇచ్చారని, ఈ సారి జనసేనకు అవకాశం ఇవ్వాలని కోరారు. రాబోయే ఎన్నికలు కీలకమైనవన్న పవన్.. ఈ సారి ప్రజలు జనసేన వైపు చూడాలని కోరారు. పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేసిన జనసేనాని.. తమకు ఎవరితోనూ పొత్తు లేదని, ప్రజలతోనే పొత్తు ఉందని స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu