జనసేన ఎమ్మెల్యే పార్టీ మారుతారా?

జనసేన ఎమ్మెల్యే పార్టీ మారుతారా?

జనసేన పార్టీ టికెట్‌పై గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్. ఆయన పార్టీ మారే అవకాశం ఉందన్న ఊహాగానాలు జోరందుకున్నాయి. ఎన్నికల్లో గెలిచినప్పటి నుండి ఈ నాయకుడిని పార్టీ పట్టించుకోలేదనే ప్రచారం జనసేన సర్కిల్స్‌లో వ్యాపించింది. ఆయన పార్టీని మార్చే అవకాశం ఉందని చర్చలు జరుగుతున్నాయి. అయితే తాను జనసేనలోనే ఉంటానని ఎమ్మెల్యే స్పష్టంచేశారు. కడప జిల్లాలో సిఎం సమావేశానికి ఎమ్మెల్యే హాజరయ్యారని జనసేన వర్గాలు తెలిపాయి. ఇటీవల జనసేన నుంచి వైసిపిలో చేరిన శ్రీధర్ మాట్లాడుతూ.. […]

TV9 Telugu Digital Desk

| Edited By:

Dec 03, 2019 | 11:18 PM

జనసేన పార్టీ టికెట్‌పై గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్. ఆయన పార్టీ మారే అవకాశం ఉందన్న ఊహాగానాలు జోరందుకున్నాయి. ఎన్నికల్లో గెలిచినప్పటి నుండి ఈ నాయకుడిని పార్టీ పట్టించుకోలేదనే ప్రచారం జనసేన సర్కిల్స్‌లో వ్యాపించింది. ఆయన పార్టీని మార్చే అవకాశం ఉందని చర్చలు జరుగుతున్నాయి. అయితే తాను జనసేనలోనే ఉంటానని ఎమ్మెల్యే స్పష్టంచేశారు. కడప జిల్లాలో సిఎం సమావేశానికి ఎమ్మెల్యే హాజరయ్యారని జనసేన వర్గాలు తెలిపాయి. ఇటీవల జనసేన నుంచి వైసిపిలో చేరిన శ్రీధర్ మాట్లాడుతూ.. జనసేనకు సన్నిహితంగా ఉన్న ముగ్గురు నాయకులు వైసిపిలో చేరారని తెలిపారు. రాపాక కూడా వైసిపిలో చేరవచ్చు. అయితే దీనిపై ఆయనే తుది నిర్ణయం తీసుకోవాలి అని వివరించారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu