Inter Student: ఇంటర్ పరీక్షసెంటర్ వద్ద కుప్పకూలిపోయిన విద్యార్థి.. తిరుపతి జిల్లాలో ఘటన..

Heart Attack: పాత తిరుపతి జిల్లా గూడూరు DRW ఎగ్జామ్ సెంటర్ వద్ద గుండెపోటుతో ఇంటర్‌ స్టూడెంట్‌ పెద్దాపురం సతీష్‌ చనిపోయాడు. ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌ ఎగ్జామ్‌ రాయడానికి వచ్చిన సతీష్‌ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఎగ్జామ్‌ సెంటర్‌ నుంచి ఆసుపత్రికి..

Inter Student: ఇంటర్ పరీక్షసెంటర్ వద్ద కుప్పకూలిపోయిన విద్యార్థి.. తిరుపతి జిల్లాలో ఘటన..
Inter Student Dies
Follow us

|

Updated on: May 10, 2022 | 12:46 PM

ఇంటర్‌ విద్యార్థి గుండెపోటుతో(Heart Attack) మృతి. మీరు చదివింది నిజమే. 18 ఏళ్ల వయస్సులోనే గుండెపోటుతో ఇంటర్‌ స్టూడెంట్‌ చనిపోయాడు. పాత తిరుపతి జిల్లా గూడూరు DRW ఎగ్జామ్ సెంటర్ వద్ద గుండెపోటుతో ఇంటర్‌ స్టూడెంట్‌ పెద్దాపురం సతీష్‌ చనిపోయాడు. ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌ ఎగ్జామ్‌ రాయడానికి వచ్చిన సతీష్‌ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. పరీక్షకు ముందు పరీక్ష కేంద్రం బయట కూర్చున్న సమయంలో విద్యార్థికి ఒక్కసారిగా చమటలు పట్టి కుప్పకూలిపోయాడు. తోటి విద్యార్థులు అక్కడ విధుల్లో ఉన్న పోలీసులకు విషయం చెప్పడంతో వారు వెంటనే గూడూరు ప్రభుత్వ వైద్యశాలకు విద్యార్థిని తరలించారు. ఎగ్జామ్‌ సెంటర్‌ నుంచి ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే చనిపోయాడు. గుండెపోటుతో చనిపోయినట్లు డాక్టర్లు ప్రాథమిక నిర్దారణకు వచ్చారు. ఎగ్జామ్‌ టెన్షనా? లేక చిన్నప్పటి నుంచి గుండె సంబంధిత సమస్యా? అనేది ఇంకా తెలియలేదు.

పూర్తి వివరాలు..

ఇవి కూడా చదవండి

తిరుపతి జిల్లా సైదాపురం మండలం కమ్మవారిపల్లె గ్రామానికి చెందిన ఏకోలు శ్రీనివాసులు కుమారుడు సతీష్‌ గూడూరు పట్టణంలో స్వర్ణాంధ్రభారతి కళాశాలలో ఇంటర్ చదువుతున్నాడు. ప్రస్తుతం ఇంటర్‌ పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో రోజూ స్వగ్రామం నుంచి గూడూరులోని పరీక్ష కేంద్రానికి వచ్చి పరీక్ష రాస్తున్నాడు. ఈ విషయాన్ని విద్యార్థి తల్లిదండ్రులకు తెలియజేయడంతో వారు గూడూరు చేరుకున్నారు. కుమారుడి మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. విద్యార్థి గుండెపోటుతో చనిపోయినట్లు ప్రాథమికంగా తెలిపిన వైద్యులు.. తల్లిదండ్రులతో మాట్లాడిన అనంతరం విద్యార్థి మృతికి కారణాలు తెలియజేయనున్నారు. ఈ మేరకు గూడూరు పట్టణ ఎస్‌ఐ పవన్‌కుమార్‌ కేసు నమోదు దర్యాప్తు చేపట్టారు.