కూరగాయలతో వరల్డ్ కప్ ట్రోఫీ..!

క్రికెట్ అభిమాని ఒకరు వినూత్న రీతిలో వరల్డ్ కప్ తయారుచేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆనపకాయ, క్యాబేజీ, 9 మునగకాయలతో వరల్డ్ కప్ నమూనా తయారు చేశాడు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు చెందిన కోయ రాజు అనే క్రికెట్ అభిమాని ఈ కూరగాయల వరల్డ్ కప్‌ను రూపొందించాడు. ఈ సందర్భంగా కోయరాజు మాట్లాడుతూ.. వినూత్నంగా ఉంటుందని ఈ కూరగాయల వరల్డ్ ట్రోఫీని తయారు చేశానని, క్రికెట్ అంటే తనకు ఎంతో ఇష్టమని అన్నాడు. ఎలాగైనా టీమిండియా […]

కూరగాయలతో వరల్డ్ కప్ ట్రోఫీ..!
TV9 Telugu Digital Desk

| Edited By:

Jul 10, 2019 | 1:01 PM

క్రికెట్ అభిమాని ఒకరు వినూత్న రీతిలో వరల్డ్ కప్ తయారుచేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆనపకాయ, క్యాబేజీ, 9 మునగకాయలతో వరల్డ్ కప్ నమూనా తయారు చేశాడు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు చెందిన కోయ రాజు అనే క్రికెట్ అభిమాని ఈ కూరగాయల వరల్డ్ కప్‌ను రూపొందించాడు. ఈ సందర్భంగా కోయరాజు మాట్లాడుతూ.. వినూత్నంగా ఉంటుందని ఈ కూరగాయల వరల్డ్ ట్రోఫీని తయారు చేశానని, క్రికెట్ అంటే తనకు ఎంతో ఇష్టమని అన్నాడు. ఎలాగైనా టీమిండియా ప్రపంచ కప్‌ను సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. అలాగే.. టీమిండియాకు ఆల్‌దిబెస్ట్ చెప్పాడు. ప్రస్తుతం ఈ కూరగాయల ట్రోఫీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu