Cyclone Alert: దూసుకొస్తున్న సిత్రాంగ్ తుఫాన్.. రేపు తీరం దాటే అవకాశం.. ఏపీకి ముప్పు తప్పినట్లేనా..

ఈ తుఫాన్ కు సిత్రాంగ్ గా నామకరణం చేశారు. ఈ పేరుని థాయ్‌లాండ్‌ సూచించింది. సిత్రాంగ్ తుఫాన్ సముద్రం లోపలి నుంచే బంగ్లాదేశ్‌ వైపు పయనిస్తోందని విశాఖ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Cyclone Alert: దూసుకొస్తున్న సిత్రాంగ్ తుఫాన్.. రేపు తీరం దాటే అవకాశం.. ఏపీకి ముప్పు తప్పినట్లేనా..
Cyclone Affect On Andhra Pr
Follow us

|

Updated on: Oct 24, 2022 | 10:47 AM

బంగాళాఖాతంలో ఏర్పడిన సిత్రాంగ్ తుఫాన్ దూసుకొస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ఆదివారం సాయంత్రం తుపానుగా మారిందని, (అక్టోబరు 25) సోమవారం ఉదయం బంగ్లాదేశ్ తీరం దాటేలోపు మరింత బలపడి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని IMD తెలిపింది. ఈ తుఫాన్ కు సిత్రాంగ్ గా నామకరణం చేశారు. ఈ పేరుని థాయ్‌లాండ్‌ సూచించింది. సిత్రాంగ్ తుఫాన్ సముద్రం లోపలి నుంచే బంగ్లాదేశ్‌ వైపు పయనిస్తోందని విశాఖ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ సిత్రాంగ్‌ తుఫాన్ బంగ్లాదేశ్ తీరం దాటే ముందు తీవ్రరూపం దాల్చొచ్చని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం పోర్ట్ బ్లెయిర్‌కు వాయువ్యంగా 475 కిలోమీటర్ల దూరంలోని సాగర్ ద్వీపానికి దక్షిణ-ఆగ్నేయంగా 780 కిలో మీటర్లు, బంగ్లాదేశ్‌లోని బారిసల్‌కు దక్షిణంగా 880 కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. ఈ తుఫాన్ అక్టోబరు 25 తెల్లవారుజామున బంగ్లాదేశ్‌కు చెందిన టింకోనా ద్వీపం, శాండ్‌విప్ మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

దీంతో పశ్చిమ బెంగాల్‌లోని కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఉత్తర కోస్తా ఒడిశాలో ఒకచోట భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. బంగాళాఖాతం తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

ఇవి కూడా చదవండి

మరోవైపు ఆంధ్రప్రదేశ్‌పై సిత్రాంగ్ ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చంటున్నారు. కాగా, అధికారులు ముందస్తుగా విశాఖ, నిజాంపట్నం, కృష్ణపట్నం, మచిలీపట్నం పోర్టులకు మొదటి ప్రమాద హెచ్చరికలు జారీ చేయగా.. గంగవరం, కాకినాడ పోర్టులకు మూడో ప్రమాదకర హెచ్చరికలు జారీ చేసింది. సముద్ర తీరం అల్లకల్లోలంగా ఉంది. దీంతో మత్య్సకారులు సముద్రంమీదకు వేటకు వెళ్లవద్దంటూ హెచ్చరించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!