చిత్తూరులో జిల్లాలో క‌ల‌క‌లం… చెత్తకుప్పలో మనిషి పుర్రె, ఎముకలు

చిత్తూరులో జిల్లాలో క‌ల‌క‌లం... చెత్తకుప్పలో మనిషి పుర్రె, ఎముకలు

చిత్తూరు జిల్లాలో క‌ల‌క‌లం చెల‌రేగింది. జిల్లాలోని కుప్పంలో రోడ్డుపై ఉన్న చెత్తుకుప్పలో మనిషి అవశేషాల బ‌య‌ట‌ప‌డ‌టంతో ప్ర‌జ‌లు భయ బ్రాంతులకు గురైయ్యారు. రోడ్డుపై ఉన్న పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద ఉన్న చెత్త కుప్పలో మనిషి పుర్రె, ఎముకలు క‌నిపించాయి. డైలీ షెడ్యూల్ లో భాగంగా ఈ రోజు కూడా పారిశుధ్య పనులు చేసేందుకు మున్సిపల్ కార్మికులు వచ్చారు. చెత్త త‌ర‌లించేందుకు డ‌స్ట్ బిన్ వ‌ద్ద‌కు వెళ్ల‌గా… అందులో మనిషి అవశేషాలు వారికి కనిపించ‌డంతో షాక్ కు […]

Ram Naramaneni

|

May 04, 2020 | 4:28 PM

చిత్తూరు జిల్లాలో క‌ల‌క‌లం చెల‌రేగింది. జిల్లాలోని కుప్పంలో రోడ్డుపై ఉన్న చెత్తుకుప్పలో మనిషి అవశేషాల బ‌య‌ట‌ప‌డ‌టంతో ప్ర‌జ‌లు భయ బ్రాంతులకు గురైయ్యారు. రోడ్డుపై ఉన్న పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద ఉన్న చెత్త కుప్పలో మనిషి పుర్రె, ఎముకలు క‌నిపించాయి. డైలీ షెడ్యూల్ లో భాగంగా ఈ రోజు కూడా పారిశుధ్య పనులు చేసేందుకు మున్సిపల్ కార్మికులు వచ్చారు. చెత్త త‌ర‌లించేందుకు డ‌స్ట్ బిన్ వ‌ద్ద‌కు వెళ్ల‌గా… అందులో మనిషి అవశేషాలు వారికి కనిపించ‌డంతో షాక్ కు గుర‌య్యారు. వెంటనే ఆ మున్సిపల్ సిబ్బంది పోలీసులకు విష‌యాన్ని చేర‌వేశారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేష‌న్ చేస్తున్నారు.

మనిషి అవశేషాలను అక్కడి నుంచి టెస్టుల కోసం ల్యాబ్‌కు పంపారు. అసలు రోడ్డుపైకి ఓ మనిషికి సంబంధించిన అవ‌శేషాలు రాత్రికి రాత్రి ఎలా వచ్చాయన్నదానిపై పోలీసులు అనుమానిస్తున్నారు. ఎవ‌రైనా చంపి శ‌వాన్ని ఇన్నిరోజులు ఇంట్లో ఉంచి..ఇప్పుడు తీసుకొచ్చి ప‌డేశారా అన్న కోణంలో కూడా ద‌ర్యాప్తు చేస్తున్నారు. ద‌గ్గ‌ర్లోని సీసీ కెమెరాల‌ను ప‌రిశీలించి..స్థానికుల‌ను ప్ర‌శ్నిస్తున్నారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu