ఆ గ్రామాన్ని వెన్నాడుతున్న చవితి భయం…

అది విజయనగరం జిల్లాలోని లచ్చిరాజుపేట గ్రామం..ఇది పార్వతీపురం మండలంలో ఉంది లచ్చిరాజుపేట గ్రామం. ఇక్కడి గ్రామస్తులను చవితి భయం వెంటాడుతోంది…వినాయక చవితి భయంతో ఇక్కడి గ్రామస్తులు..గత ముప్పై ఏళ్లుగా పండగకు దూరంగా ఉంటున్నారు…వినాయక చవితి పండగ అంటేనే ఉలిక్కిపడతారు…గణపతిని ఆరాధిస్తేనే..అరిష్టం అంటున్నారు.వినాయకచవితి పండగ జరిపితే పాపమని, ఆ పండగ చేస్తే..తమ గ్రామంలో ఎవరో ఒకరు చనిపోతారని ఆ గ్రామస్తుల సెంటిమెంట్.. దేశమంతా ఆనందంతో వినాయకచవితి సంబరాలు చేసుకుంటే ఇక్కడ మాత్రం పండగ సంబరాలను, వెరైటీ వినాయకుల ప్రతిరూపాలను […]

ఆ గ్రామాన్ని వెన్నాడుతున్న చవితి భయం...
Follow us

|

Updated on: Sep 03, 2019 | 3:59 PM

అది విజయనగరం జిల్లాలోని లచ్చిరాజుపేట గ్రామం..ఇది పార్వతీపురం మండలంలో ఉంది లచ్చిరాజుపేట గ్రామం. ఇక్కడి గ్రామస్తులను చవితి భయం వెంటాడుతోంది…వినాయక చవితి భయంతో ఇక్కడి గ్రామస్తులు..గత ముప్పై ఏళ్లుగా పండగకు దూరంగా ఉంటున్నారు…వినాయక చవితి పండగ అంటేనే ఉలిక్కిపడతారు…గణపతిని ఆరాధిస్తేనే..అరిష్టం అంటున్నారు.వినాయకచవితి పండగ జరిపితే పాపమని, ఆ పండగ చేస్తే..తమ గ్రామంలో ఎవరో ఒకరు చనిపోతారని ఆ గ్రామస్తుల సెంటిమెంట్.. దేశమంతా ఆనందంతో వినాయకచవితి సంబరాలు చేసుకుంటే ఇక్కడ మాత్రం పండగ సంబరాలను, వెరైటీ వినాయకుల ప్రతిరూపాలను టీవీల్లో చూస్తూ తరిస్తుంటారు. అయితే, తాజాగా గ్రామంలోని యువకులంతా కలిసి..ఈ యేడు చవితి వేడుకలు నిర్విహించుకుందామని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు అంతా సిద్దం చేసుకున్నారు…ఈ నేపథ్యంలోనే అనారోగ్యంతో బాధపడుతున్న ఓ మహిళ హఠాత్తుగా మృతిచెందటంతో పండగ మళ్లీ వాయిదా పడింది. పూర్వకాలం నుంచి వస్తున్న ఆచారాన్ని పక్కనపెట్టి పూజకు సిద్దం కావటం వల్లే తమ గ్రామంలో ఇలా జరిగిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అయితే, దీనిపై స్పందించిన ప్రజా సంఘాలు, హేతువాదులు మాత్రం అనారోగ్యంతో మహిళ చనిపోయింది తప్పా.. పండగ జరపాలనే నిర్ణయం కారణం కాదంటున్నారు. ఏది ఏమైనప్పటికీ లచ్చిరాజుపేట గ్రామస్తులకు మాత్రం మళ్లీ వినాయకచవితి భయం పట్టుకుంది.