లోకల్ టాలెంట్‌కే మొగ్గు… బోటు వెలికితీతలో అనూహ్య నిర్ణయం… వాహ్ సీఎం..

గోదావరిలో జరిగిన బోటు ప్రమాదం ఆంధ్రప్రదేశ్‌లో ఎలాంటి అలజడులు క్రియేట్ చేసిందో తెలిసిందే. ఈ ఘటనలో 36మందికిపైగా ప్రాణాలు కోల్పోగా.. 26మంది ప్రాణాలతో బయటపడ్డారు. ఇంకా 16మందికిపైగా ఆచూకీ తెలియడం లేదని చెబుతున్నారు. బోటు కింద వారు చిక్కుకుపోయి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బోటును బయటకు తీసేందుకు ఎన్ని ప్రయత్నాలు చేేసినవా విపలమవుతున్నాయి. విపరీతమైన వర్షాలు, వరద ప్రవాహం, ఇరుకు ప్రాంతం, సుడిగుండాలు, బోటు 210 అడుగుల లోతులో ఇరుక్కుపోవడం వంటి కారణాలు వెలికితీతకు ఆటంకాలుగా మారుతున్నాయి. […]

లోకల్ టాలెంట్‌కే మొగ్గు... బోటు వెలికితీతలో అనూహ్య నిర్ణయం... వాహ్ సీఎం..
Follow us

| Edited By:

Updated on: Sep 28, 2019 | 10:46 PM

గోదావరిలో జరిగిన బోటు ప్రమాదం ఆంధ్రప్రదేశ్‌లో ఎలాంటి అలజడులు క్రియేట్ చేసిందో తెలిసిందే. ఈ ఘటనలో 36మందికిపైగా ప్రాణాలు కోల్పోగా.. 26మంది ప్రాణాలతో బయటపడ్డారు. ఇంకా 16మందికిపైగా ఆచూకీ తెలియడం లేదని చెబుతున్నారు. బోటు కింద వారు చిక్కుకుపోయి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బోటును బయటకు తీసేందుకు ఎన్ని ప్రయత్నాలు చేేసినవా విపలమవుతున్నాయి. విపరీతమైన వర్షాలు, వరద ప్రవాహం, ఇరుకు ప్రాంతం, సుడిగుండాలు, బోటు 210 అడుగుల లోతులో ఇరుక్కుపోవడం వంటి కారణాలు వెలికితీతకు ఆటంకాలుగా మారుతున్నాయి.

స్పెషల్ రెస్క్యూ ఆపరేషన్‌:

ఆదివారం నుంచి రాయల్‌ వశిష్ట బోటును బయటకు తీసేందుకు స్పెషల్ రెస్క్యూ ఆపరేషన్‌ను ప్రారంభించనున్నారు. ఇందుకోసం రూ.22.70 లక్షల వర్క్‌ ఆర్డర్‌ ఇచ్చినట్టు  తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి తెలిపారు. బోటును వెలికి తీస్తామని కొంతమంది ముందుకు వచ్చారని.. వారు సలహాలపై కమిటీని ఏర్పాటు చేశామని.. ఆ కమిటీ సూచనతో ఆ బాధ్యతల్ని కాకినాడకు చెందిన బాలాజీ మెరైన్‌‌ కంపెనీకి అప్పగించారు.ఈ సంస్ధకు 35 అనుభవం ఉంది.  రెస్క్యూ ఆపరేషన్‌‌లో పాల్గొనే వారికి రిస్క్‌ కవరేజ్‌.. భద్రత చర్యలు తీసుకుంటున్నారు. మిస్సైన పర్యాటకుల ఆచూకీ లభించాల్సి ఉంది.. వారి డెత్‌ సర్టిఫికెట్ల జారీ కోసం ప్రత్యేక అనుమతులు ఇచ్చామన్నారు. గోదావరిలో ఇంకా రెస్క్యూ బృందాల గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.

రంగంలోకి శివ:

తాడు సాయంతో లాంచీ వెలికి తీస్తానని చెప్పిన పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన శివ కూడా ఈ ఆపరేషన్‌కు తన సలహాలు ఇవ్వడంతో పాటూ సహకరిస్తున్నట్లు కలెక్టర్ చెప్పారు. బోటును బయటకు తీసేందుకు అనువైన అన్ని మార్గాలను అన్వేశిస్తున్నట్టు ఆయన తెలిపారు.