Visakhapatnam: సీఎం జగన్‌తో ఫ్లిఫ్‌కార్ట్‌ సీఈవో భేటీ.. విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు సంసిద్ధత..

సాగర తీరం, స్టీల్‌సీటీగా పేరొందిన విశాఖ పట్నం పెట్టుబడులకు సెంటరాఫ్‌ సిటీగా మారుతోంది. తాజాగా ప్రముఖ ఈ-కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ ఈ నగరంలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది.

Visakhapatnam: సీఎం జగన్‌తో ఫ్లిఫ్‌కార్ట్‌ సీఈవో భేటీ.. విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు  సంసిద్ధత..
Follow us

|

Updated on: Dec 17, 2021 | 9:16 AM

సాగర తీరం, స్టీల్‌సీటీగా పేరొందిన విశాఖ పట్నం పెట్టుబడులకు సెంటరాఫ్‌ సిటీగా మారుతోంది. తాజాగా ప్రముఖ ఈ-కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ ఈ నగరంలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. ఈమేరకు సీఈవో కళ్యాణ్‌ కృష్ణమూర్తి, కంపెనీ సీనియర్‌ అధికారుల టీం తమ బృందంతో కలిసి ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డిని కలిశారు. తమ ప్రణాళికల గురించి వివరించారు. ఈ సందర్భంగా జగన్‌ కూడా రాష్ట్రంలో వ్యాపార అవకాశాలు, రైతులకు కనీస మద్దతు ధరలు అందేలా చూడటం, స్కిల్‌డెవలప్‌మెంట్‌ గురించి ఫ్లిప్‌కార్ట్ ప్రతినిధులకు వివరించారు. రాష్ట్ర వ్యవసాయరంగంలో విప్లవాత్మక కేంద్రాలుగా మార్చేందుకు ఆర్బీకేలను ప్రారంభించామని, రైతులకు విత్తనం అందించడం దగ్గరనుంచి వారి పంటల కొనుగోలు వరకూ నిరంతరం వెన్నుదన్నుగా నిలుస్తాయని సీఎం ఫ్లిప్‌కార్ట్‌ సీఈవోకు వివరించారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు వచ్చేలా ఫ్లిప్‌ కార్ట్‌ దోహదపడాలని ముఖ్యమంత్రి కోరారు. రైతు ఉత్పత్తులను కొనుగోలుచేసి వినియోగదారులకు అందించే కార్యక్రమంలో భాగస్వాములు కావాలన్నారు. మంచి టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురావడంలో సహాయపడాలన్నారు. ఎప్పటికప్పుడు ధరల పర్యవేక్షణకు యాప్‌ ఉందని, దాన్ని మరింత మెరుగుపరిచేందుకు తగిన తోడ్పాటు అందించాలని సీఎం సూచించారు. విశాఖ ఐటీ, ఈ–కామర్స్‌ పెట్టుబడులకు మంచి సెంటర్‌ అని, మరిన్ని పెట్టుబడులకు ముందుకు రావాలని సీఎం ఫ్లిప్‌కార్ట్‌కు పిలుపునిచ్చారు. నైపుణ్యాలను మెరుగుపరచడానికి విశాఖలో హై ఎండ్‌ స్కిల్‌యూనివర్శిటీని ఏర్పాటు చేస్తున్నామని, భాగస్వాములు కావాలన్నారు.

కాగా గూడ్స్‌ బిజినెస్‌లో రైతులనుంచి ఉత్పత్తులు కొనేందుకు తగిన చర్యలు తీసుకుంటామని ఫ్లిప్‌కార్ట్‌ సీఈవో ఈ సందర్భంగా జగన్‌కు తెలిపారు. ఇద్దరికి ప్రయోజనకరమైన మంచి టెక్నాలజీని అందించేలా తమ వంతు కృషిచేస్తామన్నారు. మరో వైపు ముఖ్యమంత్రి అందించిన ప్రతిపాదనలపై ఫ్లిప్‌కార్ట్‌ ప్రతినిధులు సంతృప్తి వ్యక్తంచేశారు. విశాఖలో ఇప్పటికే తమ సంస్థ వ్యాపారాలు చురుగ్గా సాగుతున్నాయని, మరిన్ని పెట్టుబడులు పెడతామన్నారు. నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములం అవుతామన్నారు. వచ్చే ఏడాది నుంచే ఈ కార్యక్రమాలు మొదలవుతాయని పేర్కొన్నారు.

Also Read:

AP Jobs: ఏపీలోని నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్‌.. టెక్‌ మహీంద్రాలో ఉద్యోగాలు.. రేపే ఇంటర్వ్యూలు..

Shocking News: భర్త నచ్చలేదని అర్ధరాత్రి దురాగతం.. సలసల మరిగే నూనెతో భార్య ఏం చేసిందంటే..?

బెజవాడలో ఘరానా చోరీ.. షార్ట్ ఫిల్మ్ చేయాలని పిలిచి కెమెరామెన్‌కు కుచ్చుటోపీ.. కెమెరాలతో ఉడాయించిన దొంగలు..

ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..