AP Crime: కారు రూపంలో దూసుకొచ్చిన మృత్యువు.. తండ్రీకుమారులు మృతి.. కంటతడి పెట్టించిన ఘటన

AP Crime: కారు రూపంలో దూసుకొచ్చిన మృత్యువు.. తండ్రీకుమారులు మృతి.. కంటతడి పెట్టించిన ఘటన
Accident

ఆనందంగా సాగిపోతున్న ఆ కుటుంబంపై విధి కన్నెర్ర చేసింది. కారు రూపంలో దూసుకొచ్చిన మృత్యువు ఆ ఇంట్లోని ముగ్గురిని కబళించింది. తాటి ముంజలు కొనేందుకు రోడ్డు పక్కన ఆగినవారిపై కారు దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో....

Ganesh Mudavath

|

Apr 11, 2022 | 8:10 AM

ఆనందంగా సాగిపోతున్న ఆ కుటుంబంపై విధి కన్నెర్ర చేసింది. కారు రూపంలో దూసుకొచ్చిన మృత్యువు ఆ ఇంట్లోని ముగ్గురిని కబళించింది. తాటి ముంజలు కొనేందుకు రోడ్డు పక్కన ఆగినవారిపై కారు దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో తండ్రీ, ఇద్దరు కుమారులు మృత్యువాత పడ్డారు. ఇదే ఘటనలో మరో కుటుంబానికి చెందిన వారికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ దుర్ఘటన ఇరు కుటుంబాల్లో విషాదం నింపింది. విశాఖపట్నం(Visakhapatnam) జిల్లా అనంతగిరి మండలం శివలింగపురంలో ఉపాధ్యాయునిగా విధులు నిర్వహిస్తున్న కిల్లో సోనాపతి ఉమ్మడి విజయనగరం జిల్లాలోని శృంగవరపుకోటలో(S.Kota) నివాసం ఉంటున్నారు. ఆదివారం సెలవు రోజు కావడంతో భార్యాపిల్లలతో కలిసి బైక్ పై శివలింగపురం వెళ్తున్నారు. దారి మధ్యలో తాటిముంజలు విక్రయిస్తుండగా వాటిని కొనేందుకు రోడ్డు పక్కన ఆగారు. అదే సమయంలో కాకినాడ(Kakinada) నుంచి అరకు వైపు వెళ్తున్న కారు వేగంగా వచ్చి వీరిని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో సోనాపతి కుమారులు శ్రావణ్‌, సుహాస్‌ ఎగిరి రోడ్డుపై పడి అక్కడికక్కడే మృతి చెందారు. సోనాపతికి తీవ్ర గాయాలయ్యాయి. వైద్య చికిత్స ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందతూ మరణించాడు. ఆయన భార్య శ్రావణి తీవ్ర గాయాలతో విశాఖలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఇదే ఘటనలో మరో బైక్ పై ఉన్న శృంగవరపుకోట మండలంలోని పెదఖండేపల్లికి చెందిన కొసరు అప్పారావు, ఆయన తమ్ముడి కుమార్తె సుహిత తీవ్రంగా గాయపడ్డారు. చిన్నారి కోమాలోకి వెళ్లింది. వీరిని చికిత్స కోసంవిశాఖపట్నం తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అతివేగంగా కారు నడిపి రెండు కుటుంబాలు చిన్నాభిన్నం అయ్యేలా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

Also Read

Tirupati: ఏపీలో కరెంట్ కోతల తిప్పలు.. అంధకారంలో తిరుపతి మెటర్నిటీ ఆసుపత్రి..

Viral Video: దొంగల సూపర్ ట్యాలెంట్.. సెకన్లలో షెట్టర్ లూటీ.. వీడియో చూస్తే ఫ్యూజులు ఔట్..!

IPL 2022: ఉమేష్ యాదవ్ ఖాతాలో చెత్త రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే అలాంటి లిస్టులో చేరిన తొలి బౌలర్..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu