Amaravati: నేటి నుంచి అమరావతి రైతుల మహా పాదయాత్ర – 2.. మద్దతు తెలిపిన వివిధ పార్టీలు

ఆంధ్రప్రదేశ్ కు ఏకైక రాజధానిగా అమరావతినే (Amaravati) కొనసాగించాలంటూ రాజధాని రైతులు చేస్తున్న పోరాటం నేటికి 1000 రోజులకు చేరింది. దీంతో ఇవాళ్టి (సోమవారం) నుంచి మహా పాదయాత్ర-2 ప్రారంభించేందుకు..

Amaravati: నేటి నుంచి అమరావతి రైతుల మహా పాదయాత్ర - 2.. మద్దతు తెలిపిన వివిధ పార్టీలు
Amaravati Padayatra 2
Follow us

|

Updated on: Sep 12, 2022 | 7:13 AM

ఆంధ్రప్రదేశ్ కు ఏకైక రాజధానిగా అమరావతినే (Amaravati) కొనసాగించాలంటూ రాజధాని రైతులు చేస్తున్న పోరాటం నేటికి 1000 రోజులకు చేరింది. దీంతో ఇవాళ్టి (సోమవారం) నుంచి మహా పాదయాత్ర-2 ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. అమరావతి నుంచి శ్రీకాకుళం జిల్లా అరసవిల్లి వరకూ పాదయాత్ర చేపట్టేందుకు సమాయత్తమయ్యారు. 900 కిలోమీటర్లకు పైగా మహా పాదయాత్ర – 2 సాగనుంది. 60 రోజుల పాటు జరిగేలా ప్రణాళికలు రూపొందించారు. గుంటూరు (Guntur) జిల్లాలో 9 రోజుల పాటు పాదయాత్ర జరగనుంది. 12 పార్లమెంట్, 45 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా యాత్ర సాగనుంది. తెల్లవారు జామున 5 గంటలకు వెంకటపాలెంలోని టీటీడీ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం 6గంటల 3 నిమిషాలకు పాదయాత్ర లాంఛనంగా ప్రారంభమైంది. తొలి రోజు వెంకటపాలెం, కృష్ణాయపాలెం, పెనుమాక, ఎర్రబాలెం మీదుగా మంగళగిరి వరకు రైతులు పాదయాత్ర చేయనున్నారు. ఇవాళ రాత్రికి మంగళగిరిలోనే బస చేయనున్నారు. అమరావతి అభివృద్ధి చెందితే ఆంధ్రప్రదేశ్‌ పురోగతి సాధించనుందని పాదయాత్రలో రైతులు వివరించనున్నారు. రాజధానిలోని 29 గ్రామాల నుంచి రైతులు, మహిళలు, వివిధ వర్గాల వారు ఈ పాదయాత్రలో పాల్గొననున్నారు. వెంకటపాలెంలో సోమవారం ప్రారంభమయ్యే యాత్ర వెయ్యి కిలోమీటర్లు సాగి, నవంబరు 11న శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలో ముగుస్తుంది.

రైతుల పాదయాత్రకు రాజకీయ పక్షాలు మద్దతు తెలిపాయి. పార్టీ ముఖ్య నేతలు యాత్రలో పాల్గొననున్నారు. బీజేపీ నుంచి జాతీయ కార్యదర్శి సత్యకుమార్, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్, జిల్లా అధ్యక్షులు పాటిబండ్ల రామకృష్ణ, కాంగ్రెస్ నుంచి తులసీరెడ్డి, సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, ముప్పాళ్ల నాగేశ్వరరావు, జనసేన నుంచి బోనబోయిన శ్రీనివాస్, గాదె వెంకటేశ్వర రావు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, తెనాలి శ్రవణ్ కుమార్, దేవినేని ఉమామహేశ్వరరావు, గద్దె అనురాధ తదితర ముఖ్య నేతలు హాజరు కానున్నారు.

ఇవాళ యాత్ర తొలిరోజులో భాగంగా వెంకటపాలెంలో టీటీడీ నిర్మించిన శ్రీవారి ఆలయంలో తెల్లవారుజామున 5 గంటలకు ప్రత్యేక పూజలు చేస్తారు. ఉదయం 6.03 గంటలకు ఆలయం బయట ఉన్న శ్రీవారి రథాన్ని నడిపి, పాదయాత్ర ప్రారంభిస్తారు. తర్వాత రథాన్ని వెంకటపాలెం గ్రామంలోకి తీసుకెళ్తారు. 9 గంటలకు జెండా ఊపి యాత్రను లాంఛనంగా ప్రారంభిస్తారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..