చిత్తూరు జిల్లాలో గజరాజుల బీభత్సం

తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న చిత్తూరు జిల్లాలో ఏనుగుల బెడదతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ముఖ్యంగా కుప్పం, చంద్రగిరి, పలమనేరు ప్రాంతాల్లో ఏనుగుల ప్రభావం ఎక్కువగా ఉండటంతో ఆయా ప్రాంతవాసులకు కంటిమీద కునుకులేకుండా పోయింది. శేషాచలం, తలకోన అడవుల్లో దాదాపు 40 వరకు ఏనుగులు ఉన్నాయి. ఇదిలా ఉంటే గజరాజులు తరచూ తమ పంటపొలాను నాశనం చేస్తున్నాయని ఈ ప్రాంతంలో వ్యవసాయం చేస్తున్న రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి పగలు అని తేడాలేకుండా ఎప్పుడుబడితే అప్పడు […]

చిత్తూరు జిల్లాలో  గజరాజుల బీభత్సం
TV9 Telugu Digital Desk

| Edited By:

Jul 10, 2019 | 5:33 PM

తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న చిత్తూరు జిల్లాలో ఏనుగుల బెడదతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ముఖ్యంగా కుప్పం, చంద్రగిరి, పలమనేరు ప్రాంతాల్లో ఏనుగుల ప్రభావం ఎక్కువగా ఉండటంతో ఆయా ప్రాంతవాసులకు కంటిమీద కునుకులేకుండా పోయింది. శేషాచలం, తలకోన అడవుల్లో దాదాపు 40 వరకు ఏనుగులు ఉన్నాయి. ఇదిలా ఉంటే గజరాజులు తరచూ తమ పంటపొలాను నాశనం చేస్తున్నాయని ఈ ప్రాంతంలో వ్యవసాయం చేస్తున్న రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి పగలు అని తేడాలేకుండా ఎప్పుడుబడితే అప్పడు తమ పంటలపై దాడి చేస్తున్నాయని రైతులు వాపోతున్నారు.

ఇదిలా ఉంటే చిత్తూరు జిల్లాలో ఏనుగుల బెడదను తప్పించేందుకు అటవీ అధికారులు కౌండిన్య అభయారణ్యాన్ని ఏర్పాటు చేశారు. పలుచోట్ల సోలార్ విద్యుత్ కంచెల్ని కూడా నిర్మించారు. అయినా ప్రయోజనం లేకుండా పోయిందని రైతులు అంటున్నారు. అడవిలో తగినంత ఆహారం లేకపోవడంతోనే ఇలా సమీప గ్రామాలకు వచ్చి బీభత్సం చేస్తున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా తమను ఆదుకోవాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu