తూర్పుగోదావరి జిల్లా బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు!

తూర్పుగోదావరి జిల్లాలోని తాళ్లరేవు బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 9 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. బాణసంచా తయారీ కేంద్రంలో షార్ట్‌సర్క్యూట్ కారణంగా నిప్పు రవ్వలు ఎగిసిపడ్డాయని.. దాంతో అక్కడ నిల్వ చేసిన టపాసులు పేలి పెద్ద మొత్తంలో మంటలు వ్యాపించాయని స్థానికులు తెలిపారు. బాణా సంచా తయారీ కేంద్రాల్లో ప్రమాదాలు నిత్యకృత్యంగా మారాయి.. తయారీదారులు నిబంధనలు పాటించకపోవడంతో అమాయకులు ఈ […]

తూర్పుగోదావరి జిల్లా బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు!
Follow us

| Edited By:

Updated on: Oct 18, 2019 | 7:42 PM

తూర్పుగోదావరి జిల్లాలోని తాళ్లరేవు బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 9 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. బాణసంచా తయారీ కేంద్రంలో షార్ట్‌సర్క్యూట్ కారణంగా నిప్పు రవ్వలు ఎగిసిపడ్డాయని.. దాంతో అక్కడ నిల్వ చేసిన టపాసులు పేలి పెద్ద మొత్తంలో మంటలు వ్యాపించాయని స్థానికులు తెలిపారు. బాణా సంచా తయారీ కేంద్రాల్లో ప్రమాదాలు నిత్యకృత్యంగా మారాయి.. తయారీదారులు నిబంధనలు పాటించకపోవడంతో అమాయకులు ఈ దుర్ఘటనలకు బలైపోతున్నారు.

సరిగ్గా ఇరవై రోజులక్రితం తూర్పుగోదావరి జిల్లా మేడపాడులో పేలుడు ఘటన మరువక ముందే తాళ్ళరేవు మండలం జి వేమవరం లో మరో దుర్ఘటన చోటుచేసుకుంది.. ఈ ఘటనలో పది మందికి గాయాలు కాగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.. గాయపడిన వారిలో ఏడుగురు ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో వారి కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. క్షతగాత్రులను కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు.. శుక్రవారం సాయంత్రం సుమారు నాలుగు గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్టు కాకినాడ డిఎస్పీ కరణం కుమార్ వెల్లడించారు. మేడపాడులో జరిగిన ఘటన తర్వాత పోలీసు యంత్రాంగం అప్రమత్తమైందని. తాజాగా చోటు చేసుకున్న ఘటనకు సంబంధించి పార్వతీ పరమేశ్వర ఫైర్ వర్క్స్ ను ఇటీవలే తనిఖీ నిర్వహించామన్నారు డిఎస్పీ. అనుమతులు ఉన్నప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా నిర్వాహకుడు ఆంజనేయులు బాణాసంచా తయారు చేస్తునన్నట్టు గుర్తించి అతడిని హెచ్చరించామన్నారు. నిబంధనల ప్రకారం అక్కడ నలుగురే పని చేయాల్సి ఉండగా పదిమందితో పని చేయిస్తున్నట్టు గుర్తించి హెచ్చరించినట్టు తెలిపారు. నిర్వాహకుడి పై కేసు నమోదు చేసి పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టామన్నారు. ఈ ఘటనలో గాయపడిన పదిమందిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు డి ఎస్ పి కుమార్ వెల్లడించారు..

దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?