AP News: నరసన్నపేటలో ఉద్రిక్తత.. ఎర్రన్నాయుడు చిల్డ్రన్ పార్క్ కూల్చివేత

కడపలో అన్న క్యాంటీన్ కూల్చివేత ఘటన మరవకముందే అలాంటి ఘటనే మరోసారి పునరావృతం కావడం రాష్ట్రంలో సంచలనంగా మారింది. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో(Narasannapeta) నిర్మాణ దశలో ఉన్న ఎర్రన్నాయుడు చిల్డ్రన్స్‌ పార్కును...

AP News: నరసన్నపేటలో ఉద్రిక్తత.. ఎర్రన్నాయుడు చిల్డ్రన్ పార్క్ కూల్చివేత
Errannaidu Children Park
Follow us

|

Updated on: Mar 27, 2022 | 1:02 PM

కడపలో అన్న క్యాంటీన్ కూల్చివేత ఘటన మరవకముందే అలాంటి ఘటనే మరోసారి పునరావృతం కావడం రాష్ట్రంలో సంచలనంగా మారింది. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో(Narasannapeta) నిర్మాణ దశలో ఉన్న ఎర్రన్నాయుడు చిల్డ్రన్స్‌ పార్కును(Errannaidu Children Park) కూల్చివేయడం కలకలం సృష్టించింది. గత ప్రభుత్వ హయాంలో నిధులు మంజూరైన ఈ పార్కు స్థలంపై కొందరు కన్నేసి, శనివారం వేకువజామున జేసీబీలతో పడగొట్టారు. నిర్మాణ దశలో ఉన్న పార్కు ప్రహరీ, రీడింగ్‌ రూం, గదులను కల్చేశారు. అంతర్గత రహదారులను ధ్వంసం చేశారు. విద్యుత్తు తీగలను తొలగించారు. విషయం తెలుసుకుని సంఘటనాస్థలానికి వెళ్లిస టీడీపీ(TDP) కార్యకర్తలపై కూల్చివేత చేపట్టిన వారు దాడి చేశారు. ఈ ఘటనపై మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం ఆందోళ చేపట్టారు. పార్కు నిర్మాణానికి అప్పటి కలెక్టర్‌ అనుమతులు మంజూరు చేశారు. పార్కు నిర్మాణానికి దాదాపు రూ.2 కోట్ల వ్యయం అవుతుందని భావించారు. నరసన్నపేట గ్రామ పంచాయతీ నిధుల నుంచి రూ.34.50 లక్షలు విడుదల కావడంతో పనులు ప్రారంభించారు. కో-ఆపరేటివ్‌ బిల్డింగ్‌ సొసైటీకి చెందిన ఈ స్థలం తమకే మంజూరైందంటూ 15 మంది కోర్టును ఆశ్రయించారు. దీంతో ఇప్పటివరకు పార్కు నిర్మాణం పూర్తి కాలేదు.

వైసీపీ పాలనలో పార్కులకూ రక్షణ లేకుండా పోయిందని మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నపిల్లల పార్కుపై పెద్దల కళ్లు పడ్డాయని ఆరోపించారు. ఈ ఘటనపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్‌ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. దోషులను అరెస్టు చేసి ప్రభుత్వ స్థలాలను పరిరక్షించాలని కోరారు. పార్కును ధ్వంసం చేసిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Also Read

Palm Rash: మీ అర చేతి మీద ఇలాంటి రాషెస్ కనిపిస్తే.. దీర్ఘకాలిక అనారోగ్యానికి సంకేతమట

Viral Video: భారత స్పైడర్ మ్యాన్.. రోడ్డుమీద బురద నీటి దాటిన తీరు అద్భుతం.. వీడియో వైరల్

నలుగురు బాయ్ ఫ్రెండ్స్.. భర్తతో విడాకులు.. కుమారుడిని అడ్డు తొలగించుకోవాలని దారుణం