Andhra Pradesh: ఎన్నికల అఫిడవిట్ లో తప్పుడు సమాచారం.. ఊడిన పదవి..

ఒక్కోసారి ఉద్దేశపూర్వకంగా కాకపోయినా, తెలియక చేసిన తప్పులు కూడా మనకు చేటు చేస్తాయి. మరికొన్ని సార్లు ఆ తప్పులు మనం ఎంతో ఇష్టపడే పదవులను సైతం ఊడిపోయేలా చేస్తాయి. సాధారణంగా భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో..

Andhra Pradesh: ఎన్నికల అఫిడవిట్ లో తప్పుడు సమాచారం.. ఊడిన పదవి..
Baburao, EX MPP
Follow us

|

Updated on: Sep 30, 2022 | 10:38 AM

ఒక్కోసారి ఉద్దేశపూర్వకంగా కాకపోయినా, తెలియక చేసిన తప్పులు కూడా మనకు చేటు చేస్తాయి. మరికొన్ని సార్లు ఆ తప్పులు మనం ఎంతో ఇష్టపడే పదవులను సైతం ఊడిపోయేలా చేస్తాయి. సాధారణంగా భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ప్రజాప్రతినిధులను ప్రజలు ఎన్నికల ద్వారా ఎన్నుకుంటారు. ఈ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు తమకు సంబంధించిన పూర్తి వివరాలను ప్రజలకు తెలిసేలా ఎన్నికల్లో పోటీచేసేందుకు నామినేషన్ వేసే సందర్భంగా అఫిడవిట్ లో పొందుపర్చాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రజల తరపున ఎన్నుకయ్యే ప్రతినిధి కాబట్టి.. ఆ వ్యక్తికి సంబంధించిన పూర్తి సమాచారం ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతో ఎన్నికల సంఘం ఈ నిబంధన విధించింది. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థి ఆస్తులు, సంతానం వివరాలతో పాటు నేరచరిత్రను తెలియజేయాల్సి ఉంటుంది. ఏదైనా సమాచారం తప్పుగా ఇచ్చినా, సరైన సమాచారాన్ని ఇవ్వకపోయినా అది నేరమే అవుతుంది. తొలుత ఈ అంశాలు బయటకు రాకపోయినా, గెలిచిన తర్వాత ఎవరైనా అభ్యర్థి వాస్తవ సమాచారాన్ని ఇవ్వలేదని లేదా ఏదైనా సమాచారాన్ని దాచిఉంచినట్లు విచారణలో తేలితే పదవి ఊడిపోతుంది. అందుకే ఎన్నికల్లో పోటీచేసే ప్రతి వ్యక్తి నామినేషన్ల దాఖలు సమయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. అయినా కొన్ని సార్లు అభ్యర్థులు చేసే పొరపాట్లు వారి పదవులను ఊడిపోయేలా చేస్తాయనడానికి తాజాగా చోటుచేసుకున్న ఘటన ఉదాహరణగా నిలుస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి ఎంపీపీ వంతల బాబూరావుపై అనర్హత వేటు పడింది. ఆయన ఎంపీటీసీ, ఎంపీపీ పదవులను రద్దు చేస్తూ ఎన్నికల కమిషన్‌ జారీ చేసిన ఆదేశాల మేరకు జిల్లా పరిషత్‌ కార్యాలయం నుంచి సెప్టెంబర్ 29వ తేదీ గురువారం ఉత్తర్వులు వెలువడ్డాయి. వంతల బాబూరావు చింతపల్లి ఎంపీటీసీ సెగ్మెంట్‌-3 నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలుపొందారు. ఆయనపై గతంలో పలు క్రిమినల్‌ కేసులు ఉన్నాయి. ఆ కేసుల వివరాలను ఎన్నికల అఫిడవిట్‌లో పొందుపరచలేదంటూ సొంత పార్టీకే చెందిన తాజంగి ఎంపీటీసీ సభ్యురాలు కోరాబు అనూషాదేవి పాడేరు సబ్‌కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. సబ్‌కలెక్టర్‌ విచారణ చేపట్టి అప్పటి ఉమ్మడి జిల్లా విశాఖ కలెక్టర్‌ మల్లికార్జునకు నివేదిక పంపగా ఆయన దాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు పంపించారు.

ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు బాబురావుపై చర్యలు చేపట్టారు. తదుపరి చింతపల్లి ఎంపీపీగా కోరాబు అనూషాదేవిని నియమిస్తున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. గతేడాది జరిగిన ఎంపీపీ ఎన్నికలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం నిర్ణయానికి వ్యతిరేకంగా బాబూరావు నామినేషన్‌ వేశారు. అదే పార్టీకి చెందిన ఇద్దరు పోటీపడగా లాటరీలో ఆయనకు పదవి వరించింది. అప్పటినుంచి పార్టీ అధిష్ఠానం సీరియస్‌గా ఉంది. మరోవైపు అనర్హతకు గురైన వంతల బాబురావు ఈఘటనపై స్పందిస్తూ.. పాడేరు ఎమ్మెల్యే నిర్ణయానికి వ్యతిరేకంగా తాను ఎంపీపీగా ఎన్నికవడంతోనే కక్ష కట్టి కుట్రలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై తాను హైకోర్టును ఆశ్రయిస్తానని వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం చూడండి..

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.