గండి రోడ్డులో విరిగిపడ్డ కొండచరియలు

గండి రోడ్డులో విరిగిపడ్డ కొండచరియలు

కడప జిల్లాలో పలుచోట్ల కురుస్తున్న భారీ వర్షాలు జన జీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. చక్రాయపేటలో భారీ వర్షం కురిసింది. గండి సమీపంలోని గండి – రాయచోటి రోడ్డులో తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి కొండచరియలు విరిగిపడ్డాయి. గండి శేషాచల కొండచరియలు, పెద్ద పెద్ద బండరాళ్లు విరిగి రోడ్డుపై పడడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పాడింది. దింతో గండి – రాయచోటి మార్గంలో రాకపోకలు కొద్ది సేపు నిలిచిపోయాయి. సంబంధిత అధికారులు సకాలంలో స్పందించకపోవడంతో ఆ దారిన పోయే కొందరు […]

Pardhasaradhi Peri

|

Sep 17, 2019 | 6:25 PM

కడప జిల్లాలో పలుచోట్ల కురుస్తున్న భారీ వర్షాలు జన జీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. చక్రాయపేటలో భారీ వర్షం కురిసింది. గండి సమీపంలోని గండి – రాయచోటి రోడ్డులో తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి కొండచరియలు విరిగిపడ్డాయి. గండి శేషాచల కొండచరియలు, పెద్ద పెద్ద బండరాళ్లు విరిగి రోడ్డుపై పడడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పాడింది. దింతో గండి – రాయచోటి మార్గంలో రాకపోకలు కొద్ది సేపు నిలిచిపోయాయి. సంబంధిత అధికారులు సకాలంలో స్పందించకపోవడంతో ఆ దారిన పోయే కొందరు యువకులు, స్కూల్ విద్యార్థులు కొండచరియలను తొలగించే ప్రయత్నం చేశారు. విషయం తెలుసుకున్న అధికారులు ఆలస్యంగా సంఘన స్థలానికి చేరుకుని మిగిలిన కొండచరియలను జెసిపి సహాయంతో తొలగించి ట్రాఫిక్‌ క్లియర్‌ చేశారు. కొండరాళ్లు  విరిగి పడే సమయానికి వాహనాలు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని అధికారులు, స్థానికులు చెబుతున్నారు.

Road Damaged

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu