Kona Raghupathi: ఎంతో మంది ముఖ్యమంత్రులు ఆ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు.. ఆయన మాత్రమే ప్రారంభించారు: కోన రఘుపతి

Kona Raghupathi: పోలవరం ప్రాజెక్టు నిర్మాణం దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి వరం అని ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉప సభాపతి కోన రఘుపతి..

Kona Raghupathi: ఎంతో మంది ముఖ్యమంత్రులు ఆ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు.. ఆయన మాత్రమే ప్రారంభించారు: కోన రఘుపతి
Follow us

|

Updated on: Jan 10, 2021 | 4:55 PM

Kona Raghupathi: పోలవరం ప్రాజెక్టు నిర్మాణం దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి వరం అని ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉప సభాపతి కోన రఘుపతి అన్నారు. ఆదివారం నాడు ఆయన పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. ప్రాజెక్టు పనుల పురోగతిపై ఎస్ఈ నాగిరెడ్డి, మేఘా ఇంజనీరింగ్ జనరల్ మేనేజర్ సతీష్ అంగర, మురళి పమ్మి లను అడిగి తెలుసుకున్నారు. అనంతం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎంతో మంది ముఖ్యమంత్రులు పోలవరం ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు కానీ.. పోలవరం ప్రాజెక్టును ప్రారంభించింది మాత్రం రాజశేఖర్ రెడ్డి అని పేర్కొన్నారు. ముందుచూపుతో కాల్వలను తవ్వించడం ద్వారా పనులు ముందుకు సాగుతున్నాయని అన్నారు. ప్రాజెక్టు లేకుండా కాలువలు తవ్వుతున్నారని అప్పట్లో ప్రతిపక్ష నేతలు ఎద్దేవా చేశారని గుర్తు చేసిన ఆయన.. ఆ కాలువల ద్వారానే ఇప్పుడు నీరు తరలించడం జరుగుతుందన్నారు.

పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తున్నారని కొంత మంది వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారంటూ కోన రఘుపతి ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు డిజైన్ ప్రకారమే పనులు జరుగుతున్నాయని స్పష్టం చేశారు. ప్రాజెక్టు ఎత్తులో ఒక్క అంగుళం కూడా తగ్గించడం లేదని ఉద్ఘాటించారు. అప్పట్లోనే భూసేకరణ చేయడం వల్ల ఇప్పుడు ఖర్చు తగ్గుతుందని కోన రఘుపతి అభిప్రాయపడ్డారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇస్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు. పోలవరం ప్రాజెక్టు పనుల గురించి తెలుసుకోవాలని భావించి నేడు పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వచ్చానని ఆయన వివరించారు. అనుకున్న ప్రకారం ప్రభుత్వం పోలవరం పూర్తి చేస్తుందని పూర్తి నమ్మకంతో ఉన్నాయని ఉపసభాపతి తెలిపారు.

Also read:

చంద్రబాబు రాష్ట్రం పైకి దొంగలను వదిలారు, టీడీపీ తుడిచిపెట్టుకుపోతోందన్న భయంతోనే కుట్ర : మంత్రి బాలినేని

India China Border News: అర్ధరాత్రి వేళ భారత్ భూభాగంలోకి చైనా ఆర్మీ జవాన్ … పొరపాటున వచ్చాడు విడుదల చేయమని కోరుతున్న పీఎల్‌కే

మహిళ తలలోకి ప్రవేశించిన మెదడు తినే పురుగు.. వైద్యులే షాక్
మహిళ తలలోకి ప్రవేశించిన మెదడు తినే పురుగు.. వైద్యులే షాక్
వైరల్‌గా మారిన సహజనటి ఫోటో.. గుర్తుపట్టారా..?
వైరల్‌గా మారిన సహజనటి ఫోటో.. గుర్తుపట్టారా..?
షాకిస్తున్న బంగారం, వెండి ధరలు.. 2 నెలల్లో ఎంత పెరిగాయో తెలుసా?
షాకిస్తున్న బంగారం, వెండి ధరలు.. 2 నెలల్లో ఎంత పెరిగాయో తెలుసా?
కుజ, గురు మధ్య రాశి పరివర్తన.. ఆ రాశుల వారికి భాగ్యయోగం, రాజయోగం
కుజ, గురు మధ్య రాశి పరివర్తన.. ఆ రాశుల వారికి భాగ్యయోగం, రాజయోగం
ముంబైతో మ్యాచ్.. టాస్ గెలిచిన పంజాబ్..జట్టులోకి విధ్వంసకర బ్యాటర్
ముంబైతో మ్యాచ్.. టాస్ గెలిచిన పంజాబ్..జట్టులోకి విధ్వంసకర బ్యాటర్
కుంభ రాశిలో రెండు గ్రహాల కలయిక.. ఆ రాశుల వారికి ఉద్యోగ యోగం పక్కా
కుంభ రాశిలో రెండు గ్రహాల కలయిక.. ఆ రాశుల వారికి ఉద్యోగ యోగం పక్కా
99లకే మల్టీప్లెక్స్ మూవీ టికెట్.. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడంటే?
99లకే మల్టీప్లెక్స్ మూవీ టికెట్.. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడంటే?
రాయి తంత్రం ఎవరిది? కాపు మంత్రం ఫలిస్తుందా? ఏపీలో పొలిటికల్ హీట్
రాయి తంత్రం ఎవరిది? కాపు మంత్రం ఫలిస్తుందా? ఏపీలో పొలిటికల్ హీట్
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?