Mystery Disease: పశ్చిమగోదావరి జిల్లా కొమరేపల్లిలో కలకలం.. అంతుచిక్కని వ్యాధితో పలువురికి అస్వస్థత

అదే మిస్టరీ.. అదే టెన్షన్. గోదావరి జిల్లాలను వింత వ్యాధి భయం వీడలేదు. పదే, పదే ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మండలం కోమరేపల్లి గ్రామంలో ప్రజలు ఒక్కసారిగా ఉన్నట్టుండి

  • Ram Naramaneni
  • Publish Date - 9:15 am, Fri, 22 January 21
Mystery Disease: పశ్చిమగోదావరి జిల్లా కొమరేపల్లిలో కలకలం.. అంతుచిక్కని వ్యాధితో పలువురికి అస్వస్థత

Mystery Disease:  అదే మిస్టరీ.. అదే టెన్షన్. గోదావరి జిల్లాలను వింత వ్యాధి భయం వీడలేదు. పదే, పదే ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మండలం కోమరేపల్లి గ్రామంలో ప్రజలు ఒక్కసారిగా ఉన్నట్టుండి కుప్పకూలిపోతున్నారు.  అంతుచిక్కని వ్యాధిగా  స్థానికులు అనుమానిస్తున్నారు.  ఏలూరు, పూళ్ల తరహాలో వింత వ్యాధి లక్షణాలు కనిపిస్తున్నట్లు చెబుతున్నారు. మొత్తం 14 మంది అస్వస్థతకు గురికాగా..ఏలూరు, గుండుగొలనులోని ఆస్పత్రులకు బాధితుల తరలిస్తున్నారు. ఆస్పత్రిలో చూపించుకుని ఆరుగురు బాధితులు ఇంటికి వచ్చారు. బాధితులను కలెక్టర్‌, డీఎంహెచ్‌వో, ఎమ్మెల్యే అబ్బయ్యచౌదరి పరామర్శించారు.

మరోవైపు పశ్చిమగోదావరి జిల్లా పూళ్ల గ్రామంలో ఇప్పటి వరకు 36 మంది ఈ వింత వ్యాధి బారినపడి చికిత్స పొందుతున్నారు. అయితే తాజాగా బత్తిన బుల్లబ్బాయ్‌ అనే వ్యక్తి  చనిపోవడం కలకలం రేపుతోంది. కాగా, ఆయన చావుకు వింత వ్యాధికి సంబంధం లేదని వైద్యులు చెబుతుండగా, స్థానికులు మాత్రం వింత వ్యాధి వల్లేనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద ఈ అంతుచిక్కని వ్యాధి అయితే గోదావరి వాసులును తెగ టెన్షన్ పెడుతోంది. సరైన కారణాలు తెలియకపోవడంతో వారు ఆందోళనకు గురవుతున్నారు.

Also Read:

AP Government: ఉన్నత విద్యలో నూతన కోర్సులు.. రూపకల్పనకు కమిటీ ఏర్పాటు చేస్తూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు

Tirumala: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. గురువారం శ్రీవారి దర్శించుకున్న భక్తులు సంఖ్య, హుండీ ఆదాయం వివరాలు