కరోనా అప్‌డేట్స్‌: ఏపీలో 10,199 కొత్త కేసులు.. 75 మరణాలు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 10,199 కరోనా కేసులు నమోదయ్యాయి

  • Tv9 Telugu
  • Publish Date - 6:07 pm, Thu, 3 September 20
కరోనా అప్‌డేట్స్‌: ఏపీలో 10,199 కొత్త కేసులు.. 75 మరణాలు

Andhra Pradesh Corona Updates: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 10,199 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,65,730కు చేరింది. అలాగే రాష్ట్రంలో కరోనా సోకి తాజాగా 75 మంది మరణించగా.. మృతుల సంఖ్య 4,200కు చేరింది. గడిచిన 24 గంటల్లో 9,499 మంది కరోనాను జయించగా.. కోలుకున్న వారి సంఖ్య 3,57,829కు చేరింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 39,05,775 కరోనా పరీక్షలు నిర్వహించగా.. ప్రస్తుతం రాష్ట్రంలో 103701 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

ఇక జిల్లాల వారీగా చూస్తే.. అనంతపురంలో 854, చిత్తూరులో 885, తూర్పు గోదావరిలో 1090, గుంటూరులో 805,  కడపలో 898, కృష్ణాలో 318, కర్నూలులో 616, నెల్లూరులో 982, ప్రకాశంలో 926, శ్రీకాకుళంలో 717, విశాఖలో 695, విజయనగరంలో 577, పశ్చిమ గోదావరిలో 836 కొత్త కేసులు నమోదయ్యాయి. తూర్పు గోదావరిలో 10 మంది.. చిత్తూరు, గుంటూరులో  9 మంది.. అనంతపురం, కృష్ణా, పశ్చిమ గోదావరిలో ఏడుగురు, నెల్లూరులో ఆరుగురు, కడపలో ఐదుగురు, కర్నూల్‌, శ్రీకాకుళంలో నలుగురు, ప్రకాశంలో ముగ్గురు, విశాఖపట్టణం, విజయనగరంలో ఇద్దరు మృత్యువాతపడ్డారు.

Read More:

రమేష్‌ ఆసుపత్రిపై సుప్రీం కోర్టుకు ఏపీ ప్రభుత్వం

ఓటీటీలో మూవీలు.. తమిళ సినీ డిస్ట్రిబ్యూషన్ కీలక నిర్ణయం