Jayaho BC Mahasabha: వైఎస్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో 7న జయహో బీసీ మహాసభ.. హాజరుకానున్న సీఎం జగన్..

వైఎస్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో జయహో బీసీ ఆత్మీయ సదస్సుకు ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ మేరకు బీసీ మహాసభ పోస్టర్‌ను గురువారం వైఎస్ఆర్‌సీపీ నేత, ఎంపీ విజయసాయి రెడ్డి, పలువురు మంత్రులు ఆవిష్కరించారు.

Jayaho BC Mahasabha: వైఎస్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో 7న జయహో బీసీ మహాసభ.. హాజరుకానున్న సీఎం జగన్..
Jayaho Bc Mahasabha
Follow us

|

Updated on: Dec 01, 2022 | 3:01 PM

YSRCP Jayaho BC Mahasabha: వైఎస్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో జయహో బీసీ ఆత్మీయ సదస్సుకు ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ మేరకు బీసీ మహాసభ పోస్టర్‌ను గురువారం వైఎస్ఆర్‌సీపీ నేత, ఎంపీ విజయసాయి రెడ్డి, పలువురు మంత్రులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. డిసెంబర్ ఎనిమిదిన చేపట్టాలనుకున్న బీసీల ఆత్మీయ సదస్సు ఒక రోజు ముందే నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. గురువారం విజయవాడలో ఇందిరాగాంధీ స్టేడియంని పర్యవేక్షించి, జయహో బీసీ మహాసభ పోస్టర్‌ను బీసీ నాయకులతో కలిసి విడుదల చేశారు. 7వ తేదీ ఉదయం 8 గంటలకు మొదలయ్యే ఈ సమావేశం సాయంత్రం వరకు కొనసాతుందని పేర్కొన్నారు. మధ్యాహ్నం 12 గంటలకు సీఎం జగన్ కీలక ప్రసంగం చేయనున్నారని తెలిపారు. రాబోయే రోజుల్లో జోనల్ వారీగా బీసీ మీటింగ్‌లు నిర్వహించనున్నట్లు తెలిపారు. వైఎస్ఆర్‌సీపీ నిర్వహిస్తున్న జయహో బీసీ మహాసభకు రాష్ట్రవ్యాప్తంగా 84000 మంది కీలక బీసీ నాయుకులకు ఆహ్వానం పంపినట్లు వెల్లడించారు.

Ysrcp Sabha

Ysrcp Sabha

బీసీలకు అత్యున్నత పాధాన్యం ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి జగన్: జంగా కృష్ణమూర్తి..

డిక్లరేషన్‌లో పొందుపరిచిన అంశాలతోపాటు, హామీలు ఇవ్వని కొత్త అంశాలను కూడా చేర్చి సీఎం జగన్ బీసీలకు ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని జంగా కృష్ణమూర్తి తెలిపారు. ఎన్నికల ముందే బీసీ డిక్లరేషన్ ప్రకటించారని గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చాక బీసీ డిక్లరేషన్‌లో చెప్పిన ప్రతి అంశాన్ని ప్రభుత్వం అమలు చేయడం హర్షణీయమని జంగా కృష్ణమూర్తి తెలిపారు. బీసీలకు గుర్తించి ఎన్నో అవకాశాలను ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్ అంటూ మంత్రి చెల్లుబోయిన వేణు గోపాల కృష్ణ పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి
Bc Mahasabha

Bc Mahasabha

గ్రామ స్థాయిలో సర్పంచ్ నుంచి ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కార్పొరేషన్ల ఛైర్మెన్లు, మెంబర్లు, ఆలయ కమిటీల ఛైర్మన్లు, డైరెక్టర్లు, బీసీ కార్పొరేషన్ల ఛైర్మెన్లు, డైరెక్టర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంటు సభ్యుల వరకు.. అందర్నీ ఈ సమ్మేళనానికి హాజరవుతారని తెలిపారు. ఈ సభను జయప్రదదం చేయాలని మంత్రులు కోరారు.

ఈ సమావేశానికి మంత్రులు బొత్స సత్యనారాయణ, బూడి ముత్యాలనాయుడు, జోగి రమేష్, చెల్లుబోయిన వేణు గోపాల కృష్ణ, ఎంపీ మోపిదేవి వెంకట రమణ, మార్గాని భరత్ తదితరులు హాజరయ్యారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం..