2024 ఎన్నికలే టార్గెట్‌గా మరో కీలక నిర్ణయాన్ని ప్రకటించబోతోంది వైసీపీ. టీమ్ 2024తో కేబినెట్లో సహచరులను మార్చిన సీఎం జగన్ పార్టీ బాధ్యతలను కీలక నేతలకు అప్పగించబోతున్నారు. ముందు చెప్పినట్లే మాజీ మంత్రులను ముఖ్యమైన జిల్లాల్లో రీజనల్ కోఆర్డినేటర్లుగా నియమించబోతున్నారు. పార్టీని ముందుండి నడిపించడం, నేతల్ని, ఎమ్మెల్యేల్ని సమన్వయం చేసుకోవడం, పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలను మరింతగా జనంలోకి తీసుకెళ్లడం వంటి పనులను సమర్థవంతంగా నిర్వహించే వారికే పార్టీ బాధ్యతలు ఇవ్వబోతున్నారు సీఎం జగన్. రీజనల్ కో ఆర్డినేటర్లతో పాటు.. కొత్తగా ఏర్పాటు అయిన 25 జిల్లాలకు కూడా పార్టీ అధ్యక్షులను ఖరారు చేశారు. మాజీమంత్రులు, సీనియర్ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల్లో కొందరికి ఇందులో స్థానం కల్పించారు.
జిల్లాలకు ఇన్చార్జి మంత్రులు వీరే.. 1. గుంటూరు – ధర్నాన ప్రసాదరావు 2. కాకినాడ – సిదిరి అప్పలరాజు 3. శ్రీకాకుళం – బొత్స సత్యనారాయణ 4. అనకాపల్లి – రాజన్న దొర 5. అల్లూరి సీతారామరాజు – గుడివాడ అమర్నాథ్ 6. విజయనగరం – ముత్యాల నాయుడు 7. పశ్చిమ గోదావరి – దాడిశెట్టి రాజా 8. ఏలూరు – విశ్వరూప్ 9. తూర్పు గోదావరి – చెన్నుబోయిన వేణు 10. ఎన్టీఆర్ జిల్లా – తానేటి వనిత 11. పల్నాడు జిల్లా – కారుమూరి నాగేశ్వరరావు 12. బాపట్ల – కొట్టు సత్యనారాయణ 13. అమలాపురం – జోగి రమేష్ 14. ఒంగోలు – మేరుగ నాగార్జున 15. విశాఖపట్నం – విడుదల రజని 16. నెల్లూరు – అంబటి రాంబాబు 17. కడప – ఆదిమూలపు సురేష్ 18. అన్నమయ్య జిల్లా – కాకాని గోవర్దన్ రెడ్డి 19. అనంతపురం – పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 20. కృష్ణాజిల్లా – రోజా 21 తిరుపతి – నారాయణస్వామి 22. నంధ్యాల – అంజాద్ బాషా 23. కర్నూలు – బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి 24. సత్యసాయి జిల్లా – గుమ్మనూరి జయరామ్ 25. చిత్తూరు – ఉషశ్రీ చరణ్
ఇవి కూడా చదవండి: Governor Tamilisai: సీఎం చెప్పారని ఫైల్‌పై సంతకంచేయడానికి.. నేను రబ్బర్ స్టాంప్ గవర్నర్‌ని కాదు..
Minister Harish Rao: రోగి సహాయకులకు రూ.5 భోజనం.. కీలక ప్రకటన చేసిన మంత్రి హరీష్ రావు..