Andhra Pradesh: సీఎం జగన్‌ వార్నింగ్‌ పని చేసిందిగా..! వరుసగా ప్రెస్‌మీట్లు పెట్టిన మంత్రులు, మాజీ మంత్రులు

CM Jagan Warning: సీఎం సీరియస్‌గా హెచ్చరిక చేసిన 24 గంటల్లోనే వరుసబెట్టి ప్రెస్‌మీట్లు పెట్టారు మంత్రులు, మాజీ మంత్రులు. టీడీపీకి ఓ రేంజ్‌లో కౌంటర్లు ఇచ్చారు.

Andhra Pradesh: సీఎం జగన్‌ వార్నింగ్‌ పని చేసిందిగా..! వరుసగా ప్రెస్‌మీట్లు పెట్టిన మంత్రులు, మాజీ మంత్రులు
Cm Jagan
Follow us

|

Updated on: Sep 08, 2022 | 8:16 PM

ముఖ్యమంత్రి జగన్‌ వార్నింగ్‌ బాగానే పని చేస్తున్నట్లు ఉంది. ప్రతిపక్షం విమర్శలకు కౌంటర్లు ఇవ్వరా, ఇక మీరు దేనికి అంటూ కేబినెట్‌లోనే సీఎం సీరియస్‌గా హెచ్చరిక చేసిన 24 గంటల్లోనే వరుసబెట్టి ప్రెస్‌మీట్లు పెట్టారు మంత్రులు, మాజీ మంత్రులు. టీడీపీకి ఓ రేంజ్‌లో కౌంటర్లు ఇచ్చారు. లోకేష్‌ చేసిన ట్వీట్‌పై వార్నింగ్‌లే ఇచ్చారు మంత్రులు. టీడీపీ విమర్శలు, లిక్కర్‌ స్కామ్‌లో ఆరోపణలపై మంత్రులకు సీఎం జగన్‌ తీసుకున్న క్లాస్‌ వర్కవుటు అయినట్లే కనిపిస్తోంది. తీరు మారకపోతే మూడు నెలల్లోనే మంత్రుల్ని మార్చాల్సి వస్తుందంటూ హెచ్చరించారు ముఖ్యమంత్రి. ఆయన వార్నింగ్‌ పని చేసిందో ఏమో కానీ మంత్రులు, మాజీ మంత్రులు ప్రెస్‌మీట్లు పెట్టి ప్రతిపక్షం చేసిన విమర్శలను తిప్పికొట్టారు.

అన్ని సార్లు మంత్రుల్ని మార్చడం దేనికి, మిమ్మల్ని మార్చేస్తే సరిపోతుంది కదా అంటూ ఎమ్మెల్సీ లోకేష్‌ చేసిన ట్వీట్‌పై సీరియస్‌గా రియాక్ట్‌ అయ్యారు మంత్రి మేరుగ నాగార్జున. లోకేశ్ నోటి వెంట బూతు మాటలు వస్తే నాలుక కోస్తామని వార్నింగ్ ఇచ్చారు. మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ అంశమై జరుగుతున్న ప్రచారంపై మంత్రి నాగార్జున స్పందించారు. పరిపాలనలో భాగంగా ఎలాంటి మార్పులైనా చేసుకునే అధికారం సీఎం జగన్ కు ఉంటుందన్నారు. ప్రతిపక్షాలకు భయపడే మంత్రులు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటేనని చెప్పారు.

మరోవైపు యుద్ధం చేయకుండా పారిపోయే వారు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటేనని తన అభిప్రాయాన్ని చెప్పారు మంత్రి జోగి రమేష్‌.  అమరావతిపై విమర్శలకు తనదైన శైలిలో కౌంటర్లు ఇచ్చారు మాజీ మంత్రి పేర్ని నాని. ఆ తర్వాత మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, జిల్లాలో మరికొందరు మంత్రులు కూడా ప్రెస్‌మీట్లు పెట్టి పలు అంశాలపై టీడీపీ విమర్శలకు కౌంటర్లు ఇచ్చారు. దీంతో సీఎం జగన్‌ వార్నింగ్‌ బాగానే పని చేసిందా అనే చర్చ ఏపీ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం చూడండి..

SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..