ప్రతి గ్రామానికి ఇంటర్నెట్‌ కనెక్షన్‌, అమ్మ ఒడి కింద ల్యాప్‌టాప్‌ల పంపిణీ.. ఉన్నతాధికారులకు సీఎం జగన్‌ కీలక ఆదేశాలు

గ్రామాల్లో ఇంటర్నెట్‌ లైబ్రరీలు ఏర్పాటు, ప్రతి గ్రామానికి ఇంటర్నెట్‌ కనెక్షన్‌, అమ్మ ఒడి కింద ల్యాప్‌టాప్‌ల పంపిణీపై ఉన్నతాధికారులతో..

  • K Sammaiah
  • Publish Date - 6:01 pm, Fri, 22 January 21
ప్రతి గ్రామానికి ఇంటర్నెట్‌ కనెక్షన్‌, అమ్మ ఒడి కింద ల్యాప్‌టాప్‌ల పంపిణీ.. ఉన్నతాధికారులకు సీఎం జగన్‌ కీలక ఆదేశాలు

కరోనా మహమ్మారితో ప్రపంచ వ్యాప్తంగా జనజీవనం స్తంభించిన విషయం తెలిసిందే. అనేక ఆఫీసులు మూతపడ్డాయి. పెద్ద కంపెనీలు ఉద్యోగులతో ఇంటినుంచే పని చేపిస్తున్నాయి. ఇక విద్యార్థుల అవస్థలు చెప్పవలసినవి కావు. ఆన్‌లైన్‌ చదువులతో విద్యార్థులు నానా ఇబ్బందులు పడుతున్నారు. పేద విద్యార్థులకు స్మార్ట్‌ ఫోన్లు లేక ఒకవేళ ఫోన్లు ఉన్నా ఇంటర్‌నెట్‌ సౌకర్యం లేక చదువులకు దూరం కావాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు.

గ్రామాల్లో ఇంటర్నెట్‌ లైబ్రరీలు ఏర్పాటు చేయాలని అధికారులను సీఎం జగన్‌ ఆదేశించారు సీఎం జగన్‌. సొంత ఊళ్లల్లోనే వర్క్‌ ఫ్రమ్‌ హోం సదుపాయాన్ని కల్పించాలన్నారు. ప్రతి గ్రామానికి ఇంటర్నెట్‌ కనెక్షన్‌, అమ్మ ఒడి కింద ల్యాప్‌టాప్‌ల పంపిణీపై ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష చేశారు

గ్రామాలకు అన్‌లిమిటెడ్‌ ఇంటర్నెట్‌ నెట్‌వర్క్‌ ఉండాలని అధికారులను ఆదేశించారు. అందుకోసం ప్రణాళికలు రూపొందించి పనులు ప్రారంభించాలని సూచించారు . వచ్చే ఏడాది అమ్మ ఒడి చెల్లింపుల నాటికి ల్యాప్‌టాప్‌లను ఇచ్చేందుకు సిద్ధం చేయాలని ఆదేశించారు. ల్యాప్‌టాప్‌లు చెడిపోతే గ్రామ, వార్డు సచివాలయాల్లోనే వారం రోజుల్లో తిరిగి ఇచ్చేలా ఏర్పాట్లు ఉండాలన్నారు సీఎం జగన్‌.