YSRCP Manifesto: వైసీపీ మ్యానిఫెస్టోపై సీఎం జగన్ తీవ్ర కసరత్తు.. కొత్త అంశాలు ఇవేనా..?

ఏపీలో మరోసారి సంక్షేమ బావుటా ఎగురవేసేందుకు వైసీపీ సిద్ధం అవుతుంది. 2019ఎన్నికల్లో అమలైన మ్యానిఫెస్టో సక్సస్ ఫార్ములాను మరోసారి అమలు చేయబోతోంది. గత మ్యానిఫెస్టోనే తిరిగి చేయడంతో పాటు మరికొన్ని పథకాల అమలుకు చర్యలు చేపట్టబోతుంది. అందులో భాగంగానే సీఎం జగన్ మోహన్ మ్యానిఫెస్టోపై కసరత్తు చేస్తున్నారు. ఏపీలో ఎన్నికల మ్యానిఫెస్టోపై సీయం జగన్ మోహన్ రెడ్డి కసరత్తు చేస్తున్నారు.

YSRCP Manifesto: వైసీపీ మ్యానిఫెస్టోపై సీఎం జగన్ తీవ్ర కసరత్తు.. కొత్త అంశాలు ఇవేనా..?
Cm Ys Jagan
Follow us

| Edited By: Srikar T

Updated on: Mar 07, 2024 | 8:31 PM

ఏపీలో మరోసారి సంక్షేమ బావుటా ఎగురవేసేందుకు వైసీపీ సిద్ధం అవుతుంది. 2019ఎన్నికల్లో అమలైన మ్యానిఫెస్టో సక్సస్ ఫార్ములాను మరోసారి అమలు చేయబోతోంది. గత మ్యానిఫెస్టోనే తిరిగి చేయడంతో పాటు మరికొన్ని పథకాల అమలుకు చర్యలు చేపట్టబోతుంది. అందులో భాగంగానే సీఎం జగన్ మోహన్ మ్యానిఫెస్టోపై కసరత్తు చేస్తున్నారు. ఏపీలో ఎన్నికల మ్యానిఫెస్టోపై సీయం జగన్ మోహన్ రెడ్డి కసరత్తు చేస్తున్నారు. మరోసారి ఎలాగైనా అధికారంలోకి రావడం కోసం వరుసగా సభలు, సమావేశాలలో పాల్గొంటున్నారు. ఎన్నికల్లో అత్యంత కీలకమైన మ్యానిఫెస్టోలో మరోసారి సంక్షేమానికి పెద్దపీట వేస్తూ రూపొందిస్తున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు మ్యానిఫెస్టో తాలూకు అంశాలను ప్రతి సభలోనూ వివరిస్తూ ప్రజల్లోకి వెళ్లిన సీఎం జగన్.. ఇప్పుడు అదే మ్యానిఫెస్టోకు తుది మెరుగులు దిద్దుతున్నారు. త్వరలో ప్రకటించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. గత సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రజా సంకల్ప యాత్రలో ఎదురైన అనుభవాలతో మ్యానిఫెస్టోను తయారు చేశారు. వాటిని అధికారంలోకి వచ్చిన వెనువెంటనే అమలు చేశారు.

అయితే తన 5 ఏళ్ల పరిపాలన తరువాత ఇప్పుడు జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో మ్యానిఫెస్టోను ఎలా ముందుకు తీసుకెళ్తారనే ఆసక్తి పెద్ద ఎత్తున నెలకొంది. ఒకవైపు ఏపీలో ఎలాగైన అధికారంలోకి రావాలని టీడీపీ, జనసేన పెద్ద ఎత్తున కసరత్తు చేస్తున్న వేళ.. వాటికి దీటుగా అమలు సాధ్యం అయ్యే వాటిపై సీఎం జగన్ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. ఇప్పటికే టీడీపీ, జనసేన సూపర్ సిక్స్ పేరుతో మ్యానిఫెస్టోను తెలంగాణ కాంగ్రెస్ తరహాలోనే విడుదల చేసిన వేళ.. అందుకు తగ్గట్లే మ్యానిఫెస్టోను రూపొందించడంపై సీఎం జగన్ దృష్టిసారించారు. అయితే ఒకవైపు ఎన్నికలకు సమయం దగ్గర పడే కొద్ది టీడీపీ, జనసేన పార్టీల దూకుడుకు బ్రేకులు వేసేలా సీఎం జగన్ ఈ మ్యానిఫెస్టోను తయారు చేస్తున్నారు.

ఏపీలో మళ్ళీ అధికారాన్ని తిరిగి చేజిక్కించుకోవడానికి మ్యానిఫెస్టోకు తుది మెరుగులు దిద్ది సంక్షేమం, అభివృద్ధికి పెద్ద పీట వేసేలా తయారుచేస్తున్నారు. వైసీపీ గత మ్యానిఫెస్టోలో అమలు చేసిన హామీలు, పథకాలు కొనసాగిస్తూనే కొత్త పథకాలకు సంబంధించిన వాటిపై కసరత్తు చేస్తోంది. దీనికోసం వివిధ వర్గాల నుంచి అభిప్రాయాలను సేకరిస్తోంది. గత మ్యానిఫెస్టోలో పూర్తిగా సంక్షేమానికి పెద్ద పీట వేసిన నేపథ్యంలో ఇప్పుడు తయారుచేస్తున్న మ్యానిఫెస్టోలో యువత, రైతులు, కార్మికులు, విద్యార్థులకు పెద్ద పీట వేస్తూ వారికి లబ్ధి చేకూరేలా ప్రణాళికలు రచిస్తోంది. ముఖ్యంగా వైసీపీకి కలిసొచ్చిన పెన్షన్ పెంపు, అమ్మ ఒడి లాంటి అంశాలను కొనసాగిస్తూనే పెన్షన్ పెంపు, రైతు భరోసా పెట్టుబడి పెంపు, ఉచిత బియ్యం పథకం, ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ లాంటి వాటిపై వైసీపీ ఫోకస్ పెట్టింది. గత 5 ఏళ్ల కాలంలో ప్రతి ఏడాది విడతల వారీగా పెంచుకుంటూ వచ్చిన పెన్షన్ మూడు వేల రూపాయలను నాలుగు వెలు చేసేలా అడుగులు వేస్తుంది.

ఇవి కూడా చదవండి

ఇక మరోవైపు టీడీపీ సైతం మ్యానిఫెస్టోను ఛాలెంజింగ్‎గా తీసుకుంది. వైసీపీ మహిళా సంక్షేమం పేరుతో మహిళల, వృద్ధులను ఆకట్టుకున్న నేపథ్యంలో వైసీపీ పథకాలకు కౌంటర్గా టీడీపీ మ్యానిఫెస్టో సిద్ధం చేస్తోంది. ఉచిత బస్సు, దీపం, తల్లికి వందనం, ఆడ బిడ్డ నిధి లాంటి అంశాలను చేర్చి త్వరలో మ్యానిఫెస్టో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన విజ్ఞప్తుల ఆధారంగా మేనిఫెస్టోలో కొత్త అంశాలను చేర్చేందుకు కసరత్తు చేస్తున్నారు. ప్రాథమికంగా వచ్చిన కొన్ని అంశాలను ఎప్పటికే మేనిఫెస్టోలో పొందుపరిచి ఇంకా ఏ ఏ వర్గాలకు లబ్ధి చేకూర్చాల్సి ఉందనే అనే దానిపై వైసీపీ ఫోకస్ పెట్టింది వైసీపీ. దీనికోసం పలువురు సీనియర్లు ఇప్పటికే కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే సీనియర్ ఐఏఎస్‎లు, మాజీ మంత్రులతో నివేదికల ఆధారంగా తమకు దూరంగా ఉన్న అన్ని వర్గాలను దగ్గర చేసుకోవడమే లక్ష్యంగా సంక్షేమ పథకాల మ్యానిఫెస్టోను రూపొందిస్తున్నారు. త్వరలో పూర్తిస్థాయి పథకాలతో దీనిని సీఎం జగన్ మోహన్ రెడ్డి విడుదల చేయనున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..