తిరుపతి సమీపంలో భాకరాపేట వద్ద ప్రైవేటు బస్సు ప్రమాద ఘటనలో పెళ్లి బృందానికి చెందిన పలువురు మరణించిన ఘటనపై ముఖ్యమంత్రి జగన్(CM Jagan) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. గాయపడిన వారికి రూ.50 వేలు ఇస్తామన్నారు. క్షతగాత్రులకు అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రమాదానికి కారణాలను, సహాయక చర్యలను ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. ప్రమాదం జరిగిన వెంటనే జిల్లా కలెక్టర్, ఎస్పీలు సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షించారని వెల్లడించారు. చంద్రగిరి(Chandragiri) ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికూడా ఈ సహాయక చర్యల్లో పాల్గొన్నారని సీఎంకు వివరించారు. తిరుపతి(Tirupati) లో స్థానిక ఆస్పత్రులు స్విమ్స్, రుయా, బర్డ్ ఆస్పత్రుల్లో వీరికి చికిత్స అందిస్తున్నామన్నారు. బాధితులు కోలుకునేంతవరకూ అండగా నిలవాలని అధికారులను ఆదేశించారు.
మదనపల్లె – తిరుపతి జాతీయ రహదారిపై భాకరాపేట కనుమలోని భారీ మలుపువద్ద ప్రైవేటు ట్రావెల్స్ బస్సు లోయలో పడింది. ఈ దుర్ఘటనలో ఏడుగురు మృతి చెందారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. 55 మందికి తీవ్ర గాయాలు కావడంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. అనంతపురం జిల్లా ధర్మవరం నుంచి తిరుపతికి పెళ్లి నిశ్చితార్థానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ధర్మవరంలోని రాజేంద్రనగర్‌కు చెందిన వేణు అనే యువకుడికి చిత్తూరు జిల్లా నారాయణవనం ప్రాంతానికి చెందిన యువతితో పెళ్లి చేసేందుకు పెద్దలు నిశ్చయించారు.
ఆదివారం ఉదయం తిరుచానూరులో నిశ్చితార్థం ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ధర్మవరం నుంచి మధ్యాహ్నం 3.30 గంటలకు 63 మందితో కలిసి ఓ ప్రైవేటు బస్సులో బయల్దేరారు. భాకరాపేట ఘాట్‌లో వస్తుండగా దొనకోటి గంగమ్మ వద్ద ఉన్న పెద్ద మలుపులో ప్రమాదం జరిగింది.
Also Read
Pushpa 2: సుకుమార్ భారీ ప్లాన్.. పుష్ప సీక్వెల్లో సమంత.. కానీ ఈసారి మాత్రం ఇలా..
Mishan Impossible : నిజాయితీగా కథ చెబితే ప్రేక్షకులు చూస్తారనే నమ్మకం ఉంది: స్వరూప్ ఆర్.ఎస్.జె
Health News: ఈ ఆహారాలు తింటే గుండె సురక్షితం.. కొవ్వు అస్సలు పెరగదు..!