Chandrababu: రాజధాని భూ కుంభకోణంపై సమగ్ర నివేదిక.. టీవీ9 చేతిలో మంత్రివర్గ ఉపసంఘం రిపోర్ట్ ..

రాజధాని అమరావతి భూ కుంభకోణంపై ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ ఉపసంఘం సమగ్ర నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ఆ నివేదిక ఆధారంగానే...

Chandrababu: రాజధాని భూ కుంభకోణంపై సమగ్ర నివేదిక.. టీవీ9 చేతిలో మంత్రివర్గ ఉపసంఘం రిపోర్ట్ ..
Chandrababu Amaravathi
Follow us

|

Updated on: Mar 16, 2021 | 10:43 AM

AP CID Notices to Chandrababu:  రాజధాని అమరావతి భూ కుంభకోణంపై ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ ఉపసంఘం సమగ్ర నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ఆ నివేదిక ఆధారంగానే మంగళవారం నాడు సీఐడీ అధికారులు టీడీపీ అధినేత చంద్రబాబుకు నోటీసులు అందజేశారు. అయితే, మంత్రివర్గ ఉపసంఘం నివేదిక టీవీ9 చేతికి అందింది. ఈ నివేదికలో భూముల కుంభకోణానికి సంబంధించి కీలక అధారాలు పేర్కొనడం జరిగింది. రాజధాని ప్రకటనకు ముందస్తు సమాచారంతో భూముల కోనుగోళ్లు చేసినట్లు మంత్రివర్గం తేల్చింది. క్యాపిటల్ సిటీ, రీజియన్ లో భూముల కొనుగోళ్లు జరిపినట్లు నిర్ధారించింది. బినామీ పేర్లతో టీడీపీ నేతలు కొనుగోళ్లు చేపట్టినట్టు నివేదికలో పేర్కొంది. టీడీపీ నేతలు, బినామీలకు మేలు చేసేలా చంద్రబాబు ప్రభుత్వం రాజధాని సరిహద్దులపై నిర్ణయం తీసుకుందన్నారు. లంక, పోరంబోకు, ప్రభుత్వ భూముల రికార్డుల్లో భారీ అక్రమాలు జరిగినట్లు గుర్తించింది. ల్యాండ్ పూలింగ్ స్కీమ్ కోసం రికార్డులు తారుమారు చేసినట్టు నిర్ధారించారు. భూ కేటాయింపుల్లోనూ చంద్రబాబు ప్రభుత్వం భారీ అక్రమాలకు పాల్పడ్డట్లు తేల్చారు. 1977 అసైన్డ్ భూముల చట్టాన్ని ఉల్లంఘించారని నిర్ధారించారు. 1989 ఎస్సీ, ఎస్టీ హక్కుల చట్టాన్ని ఉల్లంఘించారని నిర్ధారించారు.

అమరావతి భూముల వ్యవహారంలో టీడీపీ అధినేత చంద్రబాబుపై నమోదు అయిన కేసుల వివరాలను ఏపీ సీఐడీ అధికారులు గుంటూరు ఆరవ జూనియర్ సివిల్ జడ్జ్‌కు అందజేశారు. ఇక అంతకు ముందు.. ఈ భూముల వ్యవహారంలో నోటీసులు అందజేసేందుకు చంద్రబాబు ఇంటికి సీఐడీ డీఎస్పీ లక్ష్మీనారాయణ నేతృత్వంలోని బృందం వచ్చింది. భూముల అక్రమాలపై చంద్రబాబుకు నోటీసులిచ్చేందుకు.. ఉదయమే హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి వెళ్లారు ఏపీ సీఐడీ అధికారులు. విచారణకు హాజరుకావలసిందిగా నోటీసులు జారీ చేశారు. ఇక 41 సీఆర్పీసీ కింద మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు నోటీసులు ఇచ్చామన్నారు సీఐడీ చీఫ్‌ సునీల్‌కుమార్‌. చంద్రబాబుపై 120బి, 166, 167, 217 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. చంద్రబాబుతో పాటు మాజీ మంత్రి నారాయణకు కూడా 41 సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేశారు సీఐడీ అధికారులు.

Also Read:

MLA Kethireddy Venkatarami Reddy: మొన్నటివరకు సోషల్ మీడియాలో క్రేజ్.. ఇప్పుడు హైకమాండ్ క్లాస్..!

గసగసాల ముసుగులో నిషేధిత మాదక ద్రవ్యాలు.. మామిడి తోటలో విచ్చలవిడిగా డ్రగ్స్.. పూర్తి వివరాలు ఇవిగో

ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?