Andhra Pradesh: చిన్నారి పరిస్థితి చూసి చలించిపోయిన సీఎం.. వైద్యం కోసం రూ.కోటి మంజూరు.. అంతే కాకుండా

ప్రపంచంలోనే అరుదైన వ్యాధి. దేశంలో కేవలం 14 మంది మాత్రమే ఆ వ్యాధితో బాధపడుతున్నారు. అందుకు అయ్యే వైద్య ఖర్చు కోట్లలోనే. అలాంటి వ్యాధి ఆంధ్రప్రదేశ్ లో ఓ చిన్నారికి సోకింది. తమ బిడ్డను కాపాడాలని..

Andhra Pradesh: చిన్నారి పరిస్థితి చూసి చలించిపోయిన సీఎం.. వైద్యం కోసం రూ.కోటి మంజూరు.. అంతే కాకుండా
Cm Ys Jagan
Follow us

|

Updated on: Oct 03, 2022 | 6:37 AM

ప్రపంచంలోనే అరుదైన వ్యాధి. దేశంలో కేవలం 14 మంది మాత్రమే ఆ వ్యాధితో బాధపడుతున్నారు. అందుకు అయ్యే వైద్య ఖర్చు కోట్లలోనే. అలాంటి వ్యాధి ఆంధ్రప్రదేశ్ లో ఓ చిన్నారికి సోకింది. తమ బిడ్డను కాపాడాలని సీఎం ను కోరగానే చిన్నారి కోసం కోటి రూపాయలు మంజూరు చేశారు. అంతేకాదు చిన్నారి చదువు బాధ్యతను కూడా ప్రభుత్వమే తీసుకుంటుందని హామీ ఇచ్చారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం నక్కా రామేశ్వరం గ్రామానికి చెందిన కొప్పాడి రాంబాబు, నాగలక్ష్మి దంపతులు. వీరికి రెండున్నరేళ్ల కుమార్తె ఉంది. పుట్టుకతోనే ఈ చిన్నారికి ప్రపంచంలోనే అరుదైన వ్యాధి సోకింది. గాకర్స్ అనే వ్యాధి చిన్నారి హనీకి రావడంతో తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. ఈ వ్యాధి వల్ల లివర్ పనిచేయదు. అంతేకాదు ఈ వ్యాధి నివారణకు 52 ఇంజెక్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఒక్కో ఇంజెక్షన్ ఖరీదు లక్షా 25 వేలు. దీంతో కోటి రూపాయలు దాకా ఖర్చవుతుంది. ఏం చేయాలో దిక్కుతోచని హనీ తల్లిదండ్రులు సీఎం జగన్ తమకు అండగా ఉంటారని భావించారు.

ఐటీవల గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల పర్యటనలో కోనసీమ జిల్లా గంటి పెద్దపూడి లో ముఖ్యమంత్రి పర్యటించారు. పర్యటన ముగించుకుని బయలుదేరే సమయంలో తమ చిన్నారిని కాపాడాలని ప్లకార్డు ప్రదర్శించారు. వెంటనే అలర్ట్ అయిన సీఎం జగన్.. కాన్వాయ్ ను ఆపి వారితో మాట్లాడారు. తన వెంట హెలిపాడ్ వరకూ తీసుకెళ్లి వ్యాధికి సంబంధించిన వైద్యంపై ఆరా తీశారు. చిన్నారి ప్రాణాలు కాపాడడానికి అన్ని చర్యలు తీసుకోవాలని, ఎంత ఖర్చైనా పర్వాలేదని సీఎం అధికారులను ఆదేశించారు. వెంటనే ప్రతిపాదనలు పంపాలని కలెక్టర్ హిమాన్షు శుక్లాకు చెప్పారు. కలెక్టర్ ప్రతిపాదనలతో కోటి రూపాయలు మంజూరు చేశారు సీఎం జగన్.

ప్రస్తుతం 13 ఇంజెక్షన్లను అమలాపురం ఏరియా ఆసుపత్రిలో అందించారు. 15 రోజులకు ఒక ఇంజక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. పాప చదువుకు కూడా ప్రభుత్వం సహకరిస్తుందని కలెక్టర్ చెప్పారు. ప్రతినెలా 10 వేలు పెన్షన్ కూడా ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. సీఎం చొరవతో తమ పాప జీవితంపై ఆశ పెరిగిందని తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు సైతం పాప ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. సీఎం జగన్ తమకు ఎంతగానో సహాయం చేశారని హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
గూగుల్‌ నుంచి అదిరిపోయే ఫీచర్‌.. టోల్‌ ట్యాక్స్‌ ఆదా చేసుకోవచ్చు!
గూగుల్‌ నుంచి అదిరిపోయే ఫీచర్‌.. టోల్‌ ట్యాక్స్‌ ఆదా చేసుకోవచ్చు!
సమంతకు అనుపమ సపోర్ట్.. నేను కూడా అలా చేస్తానంటూ..
సమంతకు అనుపమ సపోర్ట్.. నేను కూడా అలా చేస్తానంటూ..
కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ
కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ
ఎల్‌టీఏ మినహాయింపు కావాలా? రెండు రోజుల్లో ఆ పని చేయడం మస్ట్
ఎల్‌టీఏ మినహాయింపు కావాలా? రెండు రోజుల్లో ఆ పని చేయడం మస్ట్
విరూపాక్ష డైరక్టర్‌‌తో అక్కినేని యంగ్ హీరో..
విరూపాక్ష డైరక్టర్‌‌తో అక్కినేని యంగ్ హీరో..
హార్దిక్‌కు మద్దతుగా సోనూసూద్.. ట్రోలర్స్‌కు హిత బోధ..ఏమన్నాడంటే?
హార్దిక్‌కు మద్దతుగా సోనూసూద్.. ట్రోలర్స్‌కు హిత బోధ..ఏమన్నాడంటే?
యూట్యూబ్‌ భారీ షాక్‌.. 9 మిలియన్లకు పైగా వీడియోల తొలగింపు.. కారణం
యూట్యూబ్‌ భారీ షాక్‌.. 9 మిలియన్లకు పైగా వీడియోల తొలగింపు.. కారణం
51ఏళ్ల వయసులో క్రికెట్‌తో అదరగొట్టిన కేంద్ర మంత్రి ఆరోగ్య మంత్రి.
51ఏళ్ల వయసులో క్రికెట్‌తో అదరగొట్టిన కేంద్ర మంత్రి ఆరోగ్య మంత్రి.