టీడీపీ అభ్యర్థులపై దాడులకు నిరసన.. తిరుపతి, చిత్తూరులో చంద్రబాబు పర్యటన, 144 సెక్షన్ ఉందంటూ పోలీసుల నోటీసులు

Chandrababu agitation : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇవాళ తిరుపతి, చిత్తూరులో పర్యటిస్తారు. ఉ.11:30కి చిత్తూరులో గాంధీ విగ్రహం ఎదుట చంద్రబాబు నిరసన చేపడతారు. సా.4గంటలకు తిరుపతిలో గాంధీ..

  • Venkata Narayana
  • Publish Date - 7:24 am, Mon, 1 March 21
టీడీపీ అభ్యర్థులపై దాడులకు నిరసన..  తిరుపతి, చిత్తూరులో చంద్రబాబు పర్యటన, 144 సెక్షన్ ఉందంటూ పోలీసుల నోటీసులు

Chandrababu agitation : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇవాళ తిరుపతి, చిత్తూరులో పర్యటిస్తారు. ఉ.11:30కి చిత్తూరులో గాంధీ విగ్రహం ఎదుట చంద్రబాబు నిరసన చేపడతారు. సా.4గంటలకు తిరుపతిలో గాంధీ విగ్రహం ఎదుట తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తోన్న ఆందోళనలో ఆయన పాల్గొంటారు. మున్సిపల్‌ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులపై.. దాడులు, అక్రమ కేసులకు వ్యతిరేకంగా చంద్రబాబు నిరసన కార్యక్రమాలు షురూ చేస్తున్నారు. అయితే, 144 సెక్షన్‌, ఎన్నికల కోడ్‌ అమలులో ఉందని పోలీసుల నోటీసులు జారీ చేయడంతో బాబు నిరసన వేళ ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నమవుతాయోనన్న ఆందోళన నెలకొంది. చంద్రబాబు నిరసనలతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడుతుందని సైతం పోలీసులు నోటీసులలో పేర్కొనడం విశేషం.

Read also : Kalvakuntla Kavitha : మరోసారి తన‌ సేవాగుణాన్ని చాటుకున్న కల్వకుంట్ల కవిత, అన్నీతానై భరోసా