మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావును కడసారి చూసుకోవడానికి కూడా వీల్లేకుండా ఆయన అభిమానులను ఇబ్బంది పెట్టడానికే నరసరావుపేట పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం 144 సెక్షన్ పెట్టిందని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. 30 పోలీస్ యాక్ట్ కూడా అమలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ మేరకు చంద్రబాబు ట్వీట్ చేశారు. ఓ వైపు ఆంక్షలు పెట్టి, మరోవైపు ప్రభుత్వ లాంఛనాలతో కోడెల అంత్యక్రియలు చేస్తామంటున్నారని.. ఇదంతా వారి దుశ్చర్యలను కప్పిపుచ్చుకోడానికేనని ఆయన దుయ్యబట్టారు. వైకాపా నేతలు ఎన్ని నాటకాలు వేసి అసత్య ప్రచారాలు చేసినా ప్రజలకు ఈ ప్రభుత్వ నిజస్వరూపం తెలిసిందన్నారు.
ఒకవైపు కోడెల అంత్యక్రియలపై ఆంక్షలు పెట్టి, మరోవైపు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు అంటున్నారు. ఇదంతా తమ దుశ్చర్యలను కప్పిపుచ్చుకోడానికే. వీళ్ళు ఎన్ని నాటకాలు వేసినా, ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా ప్రజలకు ఈ ప్రభుత్వ నిజస్వరూపం తెలిసింది.
— N Chandrababu Naidu #StayHomeSaveLives (@ncbn) September 17, 2019