జగన్‌ను ఎదుర్కొనేందుకు చంద్రబాబు అదిరిపోయే స్కెచ్..! ప్రత్యేక “రూం” ఏర్పాటుతో..

స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌తో ఏపీ రాజకీయాలు మరోసారి హీటెక్కాయి. అధికార వైసీపీని ఎదుర్కొనేందుకు టీడీపీ పక్కా వ్యూహాలను రచిస్తోంది. పార్టీ అధినేత చంద్రబాబు.. వైసీపీ ఎత్తులను ఏ విధంగా ఎదుర్కోవాలన్న దానిపై టీడీపీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఇప్పటికే ఓ వైపు రిజర్వేషన్ల అంశంపై సుప్రీంలో టీడీపీ పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. ఈ రిజర్వేషన్ల విషయం తేలేవరకు.. ఎన్నికలను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తోంది. మరోవైపు ఎట్టిపరిస్థితుల్లోనూ.. స్థానిక ఎన్నికల్లో విజయం సాధించాలని పట్టుదలతో […]

  • Updated On - 8:29 am, Sun, 8 March 20 Edited By:
జగన్‌ను ఎదుర్కొనేందుకు చంద్రబాబు అదిరిపోయే స్కెచ్..! ప్రత్యేక "రూం" ఏర్పాటుతో..

స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌తో ఏపీ రాజకీయాలు మరోసారి హీటెక్కాయి. అధికార వైసీపీని ఎదుర్కొనేందుకు టీడీపీ పక్కా వ్యూహాలను రచిస్తోంది. పార్టీ అధినేత చంద్రబాబు.. వైసీపీ ఎత్తులను ఏ విధంగా ఎదుర్కోవాలన్న దానిపై టీడీపీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఇప్పటికే ఓ వైపు రిజర్వేషన్ల అంశంపై సుప్రీంలో టీడీపీ పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. ఈ రిజర్వేషన్ల విషయం తేలేవరకు.. ఎన్నికలను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తోంది. మరోవైపు ఎట్టిపరిస్థితుల్లోనూ.. స్థానిక ఎన్నికల్లో విజయం సాధించాలని పట్టుదలతో ఉంది. ఎన్నికల్లో డబ్బు, మద్యం పంచినట్టు తేలితే సదరు అభ్యర్ధిపై కఠిన శిక్షలు అమలయ్యేలా జగన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. దీంతో ఒకవేళ అభ్యర్ధి మద్యం, డబ్బులు పంచితే ఇక.. జైలుకు వెళ్లే అవకాశం ఉంది. ఈ నిర్ణయంపై టీడీపీ పార్టీ.. సరికొత్త నిర్ణయం తీసుకుంది.

అయితే అధికార వైసీపీ అభ్యర్ధులు స్థానిక సంస్థల ఎన్నికల్లో డబ్బు, మద్యం పంచితే ఏం చేయాలన్న దానిపై టీడీపీ అధిష్టానం ప్రత్యేక దృష్టి పెట్టింది. అధికార పార్టీకి సంబంధించిన వారిపై పోలీసులు చర్యలు తీసుకుంటారో లేదో అన్న అనుమానాలు టీడీపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. అయితే వైసీపీ పార్టీకి చెందిన వారు డబ్బులు, మద్యం పంపిణీ చేస్తే.. వారికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు తీసి పంపాలని నేతలకు చంద్రబాబు సూచించారు. దీనికోసం.. ఎన్టీఆర్ భవన్‌లో కమాండ్ కంట్రోల్ రూం, టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. వైసీపీ కార్యకర్తలు డబ్బులు, మద్యం పంపిణీ చేస్తే.. వారికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపాలని.. మీడియాను ఉపయోగించుకోవాలని తెలిపారు. అంతేకాదు.. వెంటనే సంబంధిత అధికారులకు ఫిర్యాదులు చేస్తామన్నారు.

పార్టీ కోసం కంప్లైంట్ నంబంర్..

జరగబోయే స్థానిక ఎన్నికల్లో వైసీపీని ఎదుర్కొనేందుకు చంద్రబాబు నాయుడు కమాండ్ కంట్రోల్ రూంకు కాల్ చేసేందుకు ఓ నంబర్ కూడా ప్రవేశపెట్టారు. మీకు వస్తున్న ప్రలోభాలపై కానీ.. డబ్బులు, మద్యం పంపిణీ చేసినా కూడా.. 7995014525 నంబర్‌కు కాల్ చేయాలని సూచించారు.