సిక్కోలు తీరంలో హై టెన్షన్‌..రంగంలోకి కేంద్ర నిఘా బృందాలు

సముద్ర మార్గంలో దక్షిణాది రాష్ట్రాల్లో ప్రవేశించేందుకు ఉగ్రవాదులు కుట్రలు పన్నుతున్నారని నిఘా వర్గాలకు సమాచారం అందింది. దాంతో తీర ప్రాంతాల్లో హైఅలర్ట్ కొనసాగుతోంది. నెల్లూరు జిల్లాలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం – శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ను పూర్తిగా భద్రతా బలగాలు తమ చేతుల్లోకి తీసుకున్నాయి. ప్రస్తుతం షార్ పూర్తిగా భద్రతాబలగాల రక్షణలో ఉంది. అలాగే బంగాళాఖాతంలో 50 నాటికల్ మైళ్ళ వరకూ CISF, మెరైన్ పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. తీరంలో పడవలపై […]

సిక్కోలు తీరంలో హై టెన్షన్‌..రంగంలోకి కేంద్ర నిఘా బృందాలు
Follow us

|

Updated on: Sep 13, 2019 | 3:03 PM

సముద్ర మార్గంలో దక్షిణాది రాష్ట్రాల్లో ప్రవేశించేందుకు ఉగ్రవాదులు కుట్రలు పన్నుతున్నారని నిఘా వర్గాలకు సమాచారం అందింది. దాంతో తీర ప్రాంతాల్లో హైఅలర్ట్ కొనసాగుతోంది. నెల్లూరు జిల్లాలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం – శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ను పూర్తిగా భద్రతా బలగాలు తమ చేతుల్లోకి తీసుకున్నాయి. ప్రస్తుతం షార్ పూర్తిగా భద్రతాబలగాల రక్షణలో ఉంది. అలాగే బంగాళాఖాతంలో 50 నాటికల్ మైళ్ళ వరకూ CISF, మెరైన్ పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. తీరంలో పడవలపై నిఘా పెట్టారు. వారం నుంచీ తీర ప్రాంతాల్లో గస్తీ బాగా పెంచారు. ఈ నేపథ్యంలోనే అటూ.. సిక్కొలు జిల్లాలోనూ హై అలర్ట్‌ కొనసాగుతోంది. తీరంలో మెరైన్‌, కోస్ట్‌గార్డ్‌, లోకల్‌ పోలీస్‌, మత్స్యకార శాఖ అధికారులు గస్తీని ముమ్మరం చేశారు. తీరంలోని మత్స్యకార గ్రామాల ప్రజలకు అవగాహన కల్పించారు. సముద్రంలో వేటకు వెళ్లిన జాలర్ల పడవలను తనిఖీలు చేస్తున్నారు. సముద్ర మార్గంలో ఎవరైనా అనుమానిత వ్యక్తులు కనిపించినా వెను వెంటనే తమకు సమాచారం అందించాలని పోలీసులు కోరుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉగ్రమూకలను దేశంలో ప్రవేశించకుండా అడ్డుకోవాలని కేంద్ర నిఘా బృందాలు పకడ్బందీ ఏర్పాట్లు చేశాయి.