విశాఖ నుంచి కర్నూలుకు సీబీఐ అదనపు కోర్టు!

ప్రస్తుతం విశాఖపట్నంలో ఉన్న రెండవ అదనపు సిబిఐ కోర్టును రాయలసీమలోని కర్నూలు జిల్లాకు మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర న్యాయశాఖ కార్యదర్శి గురువారం ఈ ఉత్తర్వులు జారీ చేశారు. ఎపి హైకోర్టు అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ కోర్టు రాయలసీమలోని నాలుగు జిల్లాలను కవర్ చేస్తుంది. అయితే రాయలసీమ ప్రజలు ప్రస్తుత హైకోర్టును శాశ్వత హైకోర్టుగా మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. వికేంద్రీకరణ జరగాలని […]

  • Updated On - 2:39 pm, Fri, 15 November 19 Edited By:
విశాఖ నుంచి కర్నూలుకు సీబీఐ అదనపు కోర్టు!

ప్రస్తుతం విశాఖపట్నంలో ఉన్న రెండవ అదనపు సిబిఐ కోర్టును రాయలసీమలోని కర్నూలు జిల్లాకు మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర న్యాయశాఖ కార్యదర్శి గురువారం ఈ ఉత్తర్వులు జారీ చేశారు. ఎపి హైకోర్టు అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ కోర్టు రాయలసీమలోని నాలుగు జిల్లాలను కవర్ చేస్తుంది. అయితే రాయలసీమ ప్రజలు ప్రస్తుత హైకోర్టును శాశ్వత హైకోర్టుగా మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. వికేంద్రీకరణ జరగాలని వైసిపి ప్రభుత్వం భావిస్తోంది. ఈ కారణంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైకోర్టును రాయల్‌సీమకు మారుస్తుందని అంతా భావిస్తున్నారు. కానీ ఇప్పుడు రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వం నిపుణుల కమిటీని నియమించింది. ఈ కమిటీ తన నివేదికను మూడు వారాల్లో ప్రభుత్వానికి సమర్పించనుంది. ఇప్పటికే పలు ప్రాంతాలను సందర్శించిన ఈ కమిటీ త్వరలో రాయలసీమను సందర్శించి అక్కడి ప్రజల అభిప్రాయాలను సేకరిస్తుంది.