Dhulipalla Narendra: పెదకాకాని ఆలయంలో అపచారం.. మాంసాహారం వండటంపై టీడీపీ నిరసన.. ధూళిపాళ్ల నరేంద్రపై కేసు..

Dhulipalla Narendra: పెదకాకాని ఆలయంలో అపచారం.. మాంసాహారం వండటంపై టీడీపీ నిరసన.. ధూళిపాళ్ల నరేంద్రపై కేసు..
Dhulipalla

టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్రపై(Dhulipalla Narendra) కేసు నమోదైంది. పెదకాకాని ఆలయంలో మాంసాహారం వండడంపై నిరసన వ్యక్తం చేశారు ధూళిపాళ్ల. అయితే అనుమతి లేకుండా ఆఫీస్‌లోకి వచ్చారంటూ పోలీసులకు..

Sanjay Kasula

|

Apr 13, 2022 | 11:23 AM

టీడీపీ(TDP) నేత ధూళిపాళ్ల నరేంద్రపై(Dhulipalla Narendra) కేసు నమోదైంది. పెదకాకాని ఆలయంలో మాంసాహారం వండడంపై నిరసన వ్యక్తం చేశారు ధూళిపాళ్ల. అయితే అనుమతి లేకుండా ఆఫీస్‌లోకి వచ్చారంటూ పోలీసులకు ఈవో ఫిర్యాదు చేశారు. ధూళిపాళ్ల నరేంద్ర సహా మొత్తం 93 మందిపై కేసు నమోదైంది. ఐపీసీ సెక్షన్‌ 143, 341, 352, 353, 504, 506 కింద కేసులు ఫైల్ అయ్యాయి. గుంటూరు జిల్లా పెదకాకాని మల్లేశ్వరస్వామి దేవస్థానం చారిత్రక ఆలయాల్లో ఒకటి. అనేక ప్రాంతాల నుంచి భక్తులు ఈ గుడికి వస్తుంటారు. వారికి అల్పాహారం, అన్నదానానికి భోజనం ఆలయ పరిధిలో ఉన్న క్యాంటీన్‌లోనే వండుతుంటారు. ఈ క్యాంటీన్‌ను వేలం పాటలో కాంట్రాక్టుకు ఇచ్చారు. ఈ కాంట్రాక్టర్‌కు బయట కేటరింగ్‌ బిజినెస్‌ కూడా ఉంది. అయితే తన వ్యాపారం కోసం బరితెగించి, భక్తుల మనోభావాలను దెబ్బతీశాడు. కేటరింగ్‌ ఆర్డర్‌ కోసం జంకూగొంకు లేకుండా ఆలయ క్యాంటీన్‌లోనే చికెన్‌ వండించాడు.

క్యాంటీన్‌ దగ్గర రిక్షాలో చికెన్‌ కర్రీ పాత్రలు ఉండటాన్ని భక్తులు గమనించారు. ఆలయ క్యాంటీన్‌లో చికెన్‌, ఇతర పదార్థాలు వండి కేటరింగ్‌కు తీసుకువెళుతున్నట్టు గుర్తించి ఆందోళనకు దిగారు భక్తులు. ఆలయంలో అపచారం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆలయ ప్రాంగణాన్ని పుసుపు నీళ్లతో శుద్ధి చేశారు భక్తులు.

భక్తుల ఆందోళనతో ఆలయ క్యాంటీన్‌కు సీల్‌ వేశారు అధికారులు. కాంట్రాక్టర్‌కు షోకాజ్‌ నోటీస్‌ ఇచ్చారు. లైసెన్స్‌ రద్దు చేశారు. మాంసాహారాన్ని క్యాంటీన్‌లో వండించలేదని, బయట చేయించానని కాంట్రాక్టర్‌ చెప్పినట్టు ఆలయ ఈవో చెబుతున్నారు. బయట వండినా ఆలయ క్యాంటీన్‌ వద్దకు మాంసాహారాన్ని తీసుకురావడం కూడా తప్పేనన్నారు ఈవో. చికెన్‌ను గుడి క్యాంటీన్‌లో వండారా? బయట వండారా? దర్యాప్తు చేస్తామన్నారు.

ఈ ఘటనపై టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర నిరనస వ్యక్తం చేసారు. అయితే అనుమతి లేకుండా తన కార్యాలయంలోకి వచ్చారంటూ ఈవో ఫిర్యాదు చేశారు.

ఇవి కూడా చదవండి: Pranahita Pushkaralu: ఇవాళ్టి నుంచి ప్రాణహిత నది పుష్కరాలు.. మధ్యాహ్నం తర్వాత నదిలోకి పుష్కర పురుషుడు..

Tree City: భాగ్యనగరానికి మరో అరుదైన గుర్తింపు.. రెండోసారి ట్రీ సిటీగా..

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu