ఏపీ బంద్‌కు ఏబీవీపీ పిలుపు..!

నేడు ఏపీలో పాఠశాలల బంద్‌కు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్(ఏబీవీపీ) పిలుపునిచ్చింది. పెంచిన ఫీజులు తగ్గించడంతో పాటు మరో 9 డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఏబీవీపీ బంద్‌కు పిలుపునివ్వగా.. ప్రభుత్వ పాఠశాలలను మరింత పటిష్టం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విద్యార్థి నేతలు కోరారు. విద్యాహక్కు చట్టాన్ని పక్కాగా అమలు చేయాలని.. ప్రైవేటు స్కూళ్లలో 25% సీట్లను నిరుపేదలకు కేటాయించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ఏపీలో ఖాళీ ఉన్న డీఈఓ, డిప్యూటీ డీఈఓ, ఎంఈఓ పోస్టులను […]

ఏపీ బంద్‌కు ఏబీవీపీ పిలుపు..!
Follow us

| Edited By: Srinu

Updated on: Jun 28, 2019 | 2:34 PM

నేడు ఏపీలో పాఠశాలల బంద్‌కు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్(ఏబీవీపీ) పిలుపునిచ్చింది. పెంచిన ఫీజులు తగ్గించడంతో పాటు మరో 9 డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఏబీవీపీ బంద్‌కు పిలుపునివ్వగా.. ప్రభుత్వ పాఠశాలలను మరింత పటిష్టం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విద్యార్థి నేతలు కోరారు. విద్యాహక్కు చట్టాన్ని పక్కాగా అమలు చేయాలని.. ప్రైవేటు స్కూళ్లలో 25% సీట్లను నిరుపేదలకు కేటాయించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ఏపీలో ఖాళీ ఉన్న డీఈఓ, డిప్యూటీ డీఈఓ, ఎంఈఓ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని నేతలు డిమాండ్ చేస్తున్నారు.