కుంచించుకుపోతోన్న సాగరమాల “బకింగ్‌హాం’

శతాబ్దాల చరిత్ర గల బకింగ్‌హాం కెనాల్‌ బ్రిటీష్‌ పాలకుల కాలంలో ఒక వెలుగు వెలిగింది. బంగాళాఖాతం సమద్ర తీరంలో లాంచీలు, బోట్లు, పడవలు ముమ్మరంగా తిరిగేవి. తీరం వెంబడి కళకళలాడుతూ దీపాలతో దేదీప్యమానంగా వెలుగొందేది. ఆ వైభవం కాలక్రమేణా మసకబారింది. బకింగ్‌హాం కాలువకు కాలదోషం పట్టింది. 1970నుంచి కాలక్రమేణా ఈ కాలువ కనుమరుగవుతూ వస్తోంది. చెన్నై నుంచి కాకినాడ వరకు ఉన్న బకింగ్‌హాం కాలువ దాదాపు కుచించుకుపోయింది. సరాసరి 100 మీటర్లు ఉండాల్సిన కాలువ ప్రస్తుతం 10 మీటర్లు కూడా లేదంటే […]

కుంచించుకుపోతోన్న సాగరమాల బకింగ్‌హాం'
Follow us

| Edited By: Srinu

Updated on: Aug 29, 2019 | 2:02 PM

శతాబ్దాల చరిత్ర గల బకింగ్‌హాం కెనాల్‌ బ్రిటీష్‌ పాలకుల కాలంలో ఒక వెలుగు వెలిగింది. బంగాళాఖాతం సమద్ర తీరంలో లాంచీలు, బోట్లు, పడవలు ముమ్మరంగా తిరిగేవి. తీరం వెంబడి కళకళలాడుతూ దీపాలతో దేదీప్యమానంగా వెలుగొందేది. ఆ వైభవం కాలక్రమేణా మసకబారింది. బకింగ్‌హాం కాలువకు కాలదోషం పట్టింది. 1970నుంచి కాలక్రమేణా ఈ కాలువ కనుమరుగవుతూ వస్తోంది. చెన్నై నుంచి కాకినాడ వరకు ఉన్న బకింగ్‌హాం కాలువ దాదాపు కుచించుకుపోయింది. సరాసరి 100 మీటర్లు ఉండాల్సిన కాలువ ప్రస్తుతం 10 మీటర్లు కూడా లేదంటే కాలువ పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్ధమవుతుంది. శిథిలావస్థకు చేరి ఆక్రమణ దారుల కబంధ హస్తాల్లో బకింగ్‌హామ్‌ చిక్కుకు పోయింది. కెనాల్‌ పొడవు 427 కి.మీ. కృష్ణా, గోదావరి డెల్టాలను కలుపుతూ ఈ కాలువ కొనసాగుతుంది. కొన్ని చోట్ల సముద్రానికి మూడు మైళ్ల దూరంలోనూ, ఎక్కువభాగం అరకిలోమీటర్‌ దూరంలోనూ ఉండడం విశేషం.

ప్రకాశం జిల్లాలో 119కిలోమీటర్ల మేర విస్తరించిన ఈ కాలువ..కాకినాడనుంచి కృష్ణపట్నం వరకు 800 కిలోమీటర్లు పొడవు వుంటుంది. అప్పట్లో మానవ, సరుకు రవాణాకు ఉపయోగపడింది. ఆ ఆనవాలును అనుసరించి కేంద్రం పోర్టులకు సమాంతరంగా, ఇన్లాండ్ వాటర్ వేను నిర్మించేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. బకింగ్‌హామ్‌ కెనాల్‌ను పునరుద్ధరిస్తే  నేటి పరిస్థితుల్లోఎన్నోప్రయోజనాలు చేకూరుతాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికే డీజిల్‌ రేట్లు పెరిగాయి. ఉపరితల రవాణా భారంగా మారింది. ట్రాఫిక్‌ ఇబ్బందులు సైతం ఇబ్బడి ముబ్బడిగా తలెత్తుతున్నాయి. బకింగ్‌హాం కెనాల్‌ను పునరుద్దరిస్తే రవాణా ఖర్చు తగ్గడంతో పాటు ట్రాఫిక్‌ ఇబ్బందులు సగానికి సగం తగ్గుతాయి. మరోవైపు సునామీ లాంటి  విపత్తుల ప్రభావాన్ని తగ్గించేందుకు కూడా బకింగ్‌ హామ్‌ కెనాల్‌ ఉపయోగపడుతుంది. సర్కార్‌ నిర్ణయం సవ్యంగా పట్టాలెక్కితే…రాష్ట్రంలోనే అతి పెద్ద జలరవాణా మార్గంగా బకింగ్‌ హామ్‌ కెనాల్‌ నిలిచిపోతుందని, రాష్ట్రానికి పూర్వ వైభవం తిరిగి లభిస్తుందని ప్రజా సంఘాల   నేతలు కోరుతున్నారు.