Blue Moon Effect: ఉప్పాడ సముద్ర తీరంపై బ్ల్యూ మూన్ ఎఫెక్ట్.. రక్షణగా వేసిన జియో ట్యూబ్‌ పూర్తిగా ధ్వంసం

ఆంధ్రప్రదేశ్‌కు ముప్పు పొంచి ఉందా..? సముద్ర తీరం నిత్యం అల్లకల్లోలకంగా ఎందుకు మారుతోంది..? ముఖ్యంగా గ్రహణం వచ్చిదంటే చాలు తీరం పొడవునా బురద నీటి అలలు ఉగ్రంగా వస్తుండడం దేనికి సంకేతం..

Blue Moon Effect: ఉప్పాడ సముద్ర తీరంపై బ్ల్యూ మూన్ ఎఫెక్ట్.. రక్షణగా వేసిన జియో ట్యూబ్‌ పూర్తిగా ధ్వంసం
Uppada Coast
Follow us

|

Updated on: Nov 09, 2022 | 1:35 PM

ఉప్పాడ సముద్రం ఉరిమింది. పౌర్ణమి, గ్రహణం తోడవడంతో అలలు ఉవ్వెత్తున లేచాయి. భారీ అలలకు ఉప్పాడ-కాకినాడ బీచ్ కోతకు గురైంది. సాధారణంగా ఆటు పోట్లు, తుఫాన్‌లు,అల్పపీడనాల సమయంలో తరచూ తీరం కోతకు గురవుతూ ఉంటుంది. కానీ నిన్ని పరిస్థితి చూస్తే తీరప్రాంత వాసులు సైతం భయపడేలా ఉంది. నిన్న పౌర్ణమికి గ్రహణం తోడవడంతో ఉవ్వెత్తున రాకాసి అలలు ఎగసిపడ్డాయి. గత రోజుల నుంచి అల్లకల్లోలం మారింది ఉప్పాడ సముద్రతీరం.. దీంతో సుబ్బంపేట నుండి నేమం వరకు పలుచోట్ల కోతకు గురై..చీట్‌ రోడ్డు పూర్తిగా ధ్వంసం అయింది. రక్షణగా వేసిన జియో ట్యూబ్ సైతం పూర్తిగా దెబ్బతింది. మాయాపట్నం, నాయకర్ కాలనీ, సూరాడ పేట వద్ద తీరం పూర్తిగా కోతకు గురైంది.

అలల తాకిడికి రోడ్డు పూర్తిగా ధ్వంసం అయింది. దీంతో రాకపోకలు ప్రమాదకరంగా మారాయి. మరోపక్క కార్తీక వనభోజనాలు, బీచ్‌లో సందర్శకుల తాకిడి ఉన్నా..ఎక్కడా హెచ్చరిక బోర్డులు కనిపించలేదు. ఆదమరిస్తే వాహనాలు బోల్తాపడి సముద్రంలో గల్లంతయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తీర ప్రాంత వాసులు.

మరిన్ని ఏపీ న్యూస్ కోసం