Guntur: జిన్నాటవర్ పేరు మార్చాలని బీజేవైఎం డిమాండ్.. ఆ తేదీ వరకు డెడ్ లైన్..!

గుంటూరు టౌన్ జిన్నా టవర్ వివాదంతో అట్టుడికింది. గుంటూరులోని శంకర్‌ విలాస్‌ సెంటర్‌లో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. జిన్నా టవర్‌ పేరు మార్చాలంటూ..

Guntur: జిన్నాటవర్ పేరు మార్చాలని బీజేవైఎం డిమాండ్.. ఆ తేదీ వరకు డెడ్ లైన్..!
Guntur Jinna Tower Center
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: May 25, 2022 | 2:10 PM

గుంటూరు టౌన్ జిన్నా టవర్ వివాదంతో అట్టుడికింది. గుంటూరులోని శంకర్‌ విలాస్‌ సెంటర్‌లో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. జిన్నా టవర్‌ పేరు మార్చాలంటూ సెంటర్‌ వైపు దూసుకెళ్లారు బీజేవైఎం కార్యకర్తలు. జిన్నా టవర్‌ పేరు మార్చాలని డిమాండ్‌ చేస్తూ, ఆందోళనకు దిగారు. ఈ ఆందోళనలో బీజేపీ కీలక నేతలు, సునీల్‌ దియోధర్‌, సత్యకుమార్‌ పాల్గొన్నారు. వీరిని అడ్డుకున్నారు పోలీసులు. అనంతరం స్టేషన్ కు తరలించారు. పోలీసులు అడ్డుకోవడంతో, రోడ్డుపై బైఠాయించిన నినాదాలు చేశారు బీజేవైఎం కార్యకర్తలు. జిన్నా టవర్‌ మార్చి, అబ్దుల్‌కలాం పేరు పెట్టాలని నినాదాలు చేశారు. పేరు మార్చకపోతే ఆగస్టు15కి జిన్నాటవర్‌ కూల్చేస్తామని వార్నింగ్‌ ఇచ్చారు బీజేవైఎం నేతలు.

గుంటూరులో జిన్నా టవర్ వివాదంపై ఆందోళన చేస్తున్న బీజేపీ నేతలను అరెస్ట్ చేయడాన్ని ట్విట్టర్ వేదికగా తప్పుబట్టారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. అరెస్టులతో ఉద్యమాలను నిలువరించలేరని విషయం వైసీపీ ప్రభుత్వం గ్రహించాలన్నాలని సూచించారు సోము. జిన్నా టవర్ పేరు మార్చడానికి ప్రజా ఉద్యమం నిర్మాణం చేస్తామని తెలిపారు. శోభాయాత్ర నిర్వహిస్తే అరెస్టులు చేయడం ఏమిటి? అని ప్రశ్నించారు సోము వీర్రాజు.