Tomato Prices: దారుణంగా పడిపోయిన టమాటా ధరలు.. మార్కెట్లో ఎంత ఉందంటే..?

Tomato Rate Today: ఊరించి.. ఉసూరుమనిపించింది.. ఆకాశాన్నంటిన ధరలు ఒక్కసారిగా ఢమాల్‌మన్నాయి. నింగి నుంచి నేలమీదికొచ్చేశాయి. ఒక్కరోజులోనే 100 నుంచి 10కి చేరింది కిలో టమోటా ధర. మంచి ధర వస్తుందని ఆశపడ్డ రైతులకు నిరాశే మిగిల్చింది.

Tomato Prices: దారుణంగా పడిపోయిన టమాటా ధరలు.. మార్కెట్లో ఎంత ఉందంటే..?
Tomato
Follow us

|

Updated on: Mar 15, 2022 | 6:56 AM

మార్కెట్ మాయజాలం. ఒక రోజు పెరుగుతున్న ధర, మరో రోజు అమాంతం పడిపోతుంది. దీంతో సరుకుతో మార్కెట్‌కు వెళ్లిన రైతు విలవిలలాడుతున్నాడు. ఎప్పుడు ఏ ధర ఉంటుందో అర్థంకాక అయోమయానికి గురవుతున్నాడు. అసలు తమకు దక్కేది ఎంతో తెలియక సతమతమవుతున్నాడు. అయితే అతి వృష్టి.. లేదంటే అనావృష్టి అనేలా ఉంది టమాట రైతు దుస్థితి(Tomato Prices). రోజురోజుకు క్షీణిస్తున్న ధరలతో రైతు ఆవేదన అంతా ఇంతా కాదు. కనీసం రవాణా ఖర్చులు కూడా రాక తీవ్ర ఆందోళన చెందుతున్నాడు. కిలో వందరూపాయలు పలికిన టమాట ధరలు.. నేడు అథపాతాళానికి పడిపోయాయి. గిట్టుబాటు ధర రాక పంటను రోడ్డుమీద పారబోస్తున్నాడు రైతు. సిద్దిపేట జిల్లాలో వరికి ప్రత్యామ్నాయంగా టమాటాను భారీగా సాగుచేస్తున్నారు. దుబ్బాక ప్రాంతంలో భారీగా సాగైన టమాటాకు గిట్టుబాటు ధర మాత్రం దొరకడం లేదు. కిలో వంద రూపాయలకు పైగా పలికిన టమాటా ధర.. నేడు ఐదు రూపాయలకు పడిపోయింది. ఆ అయిదు రూపాయలకైనా అమ్ముదామంటే కొనే నాథుడే కరువయ్యాడు.

దీంతో రైతుకు ఏం చేయాలో అర్థంకాక.. మద్దతు ధర దొరక్క.. పంటను రోడ్లపైన పారబోస్తున్నాడు. దుబ్బాక నుండి ముస్తాబాద్ వైపు వెళ్లే రోడ్డులో ఎక్కడ చూసినా టమాటా కుప్పలే కనిపిస్తాయి. మార్కెట్‌ మాయాజాలం ఒకవైపు.. వ్యాపారుల సిండికేట్‌ ఇంకోవైపు.. టమాటా రైతుకు మరిన్ని కష్టాలు తెచ్చిపెడుతున్నాయి. టమాటాకు ఎప్పుడు ధరలు పెరుగుతాయో.. ఎప్పుడు తగ్గుతాయో తెలియక అయోమయ స్థితిలో ఉన్నారు రైతులు.

పెట్టుబడి మాట దేవుడెరుగు.. కనీసం రవాణా ఖర్చులు కూడా రావడం లేదని ఆందోళన చెందుతున్నారు. మరోవైపు పొద్దంతా ఎండలో కూర్చుని అమ్మినా పెట్రోల్‌ ఖర్చులు కూడా రావట్లేదంటున్నారు వ్యాపారులు. 20ఏళ్ల నుంచి దందా చేస్తున్న.. ఇంత దారుణంగా ఎన్నడూ లేదు. ఏంజేయాలో అర్థంకావడం లేదంటోంది టమాటా వ్యాపారి. కనీసం పెట్రోల్‌ ఖర్చులు కూడా రావట్లేదని చెబుతున్నారామె.

ఇవి కూడా చదవండి: Viral Video: సింహాల గుంపుకి చుక్కలు చూపించిన గేదెలు.. ఫ్రెండ్‌ ఆపదలో ఉంటే కాపాడాల్సిందేగా..

Sandhya Raju: ఆకట్టుకుంటున్న నాట్యం హీరోయిన్ ఫినామిల్ ఉమెన్ వీడియో.. ప్రశంసలు కురిపించిన ఎఆర్ రెహమాన్..

వేసవిలో పగిలిన పెదవులతో ఇబ్బందా..? ఎఫెక్టివ్ హోం రెమెడీస్..

అప్పుడు సచిన్ కాంగ్రెస్ ఆఫర్‌కి ఓకే చెప్పి ఉంటే ఏం జరిగి ఉండేది ?

జూబ్లీహిల్స్‌లో కారు బీభత్సం.. అదుపు తప్పి ట్రాన్స్‌ఫార్మర్‌ పైకి

ఎన్నికల వేళ సామాజివర్గం అంశాన్ని తెరపైకి తెచ్చిన రేణుకా చౌదరి..

రెండు రోజుల్లో రెండోసారి పత్రికాముఖంగా క్షమాపణలు

కొరియర్ పేరుతో కోటి రూపాయలకు కన్నం
కొరియర్ పేరుతో కోటి రూపాయలకు కన్నం
అంతరిక్షం నుంచి నాసాకు మెసేజ్.. ఎవరు చేశారో తెలుసా ??

ఎన్నికల వేళ రిజర్వేషన్ల రగడ.. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్‎గా రాజకీయం

ఈవెనింగ్ వాకింగ్ వల్ల ఇన్ని లాభాలా..? తప్పక అలవాటు చేసుకోండి..

రొయ్యల చెరువు వద్ద కుప్పలు తెప్పలుగా పార్శిళ్లు.. చెక్ చేయగా.!
రొయ్యల చెరువు వద్ద కుప్పలు తెప్పలుగా పార్శిళ్లు.. చెక్ చేయగా.!
అప్పుడు సచిన్ కాంగ్రెస్ ఆఫర్‌కి ఓకే చెప్పి ఉంటే ఏం జరిగి ఉండేది ?
అప్పుడు సచిన్ కాంగ్రెస్ ఆఫర్‌కి ఓకే చెప్పి ఉంటే ఏం జరిగి ఉండేది ?
జూబ్లీహిల్స్‌లో కారు బీభత్సం.. అదుపు తప్పి ట్రాన్స్‌ఫార్మర్‌ పైకి
జూబ్లీహిల్స్‌లో కారు బీభత్సం.. అదుపు తప్పి ట్రాన్స్‌ఫార్మర్‌ పైకి
ఎన్నికల వేళ సామాజివర్గం అంశాన్ని తెరపైకి తెచ్చిన రేణుకా చౌదరి..
ఎన్నికల వేళ సామాజివర్గం అంశాన్ని తెరపైకి తెచ్చిన రేణుకా చౌదరి..
రెండు రోజుల్లో రెండోసారి పత్రికాముఖంగా క్షమాపణలు
రెండు రోజుల్లో రెండోసారి పత్రికాముఖంగా క్షమాపణలు
కొరియర్ పేరుతో కోటి రూపాయలకు కన్నం
కొరియర్ పేరుతో కోటి రూపాయలకు కన్నం
అంతరిక్షం నుంచి నాసాకు మెసేజ్.. ఎవరు చేశారో తెలుసా ??
అంతరిక్షం నుంచి నాసాకు మెసేజ్.. ఎవరు చేశారో తెలుసా ??
రొయ్యల చెరువు వద్ద కుప్పలు తెప్పలుగా పార్శిళ్లు.. చెక్ చేయగా.!
రొయ్యల చెరువు వద్ద కుప్పలు తెప్పలుగా పార్శిళ్లు.. చెక్ చేయగా.!
ఓ కంటైనర్‌లో దొరికిన ఇనుప పెట్టెలు.. తెరిచి చూడగా కళ్లు జిగేల్.!

వైద్య విద్య చదివేందుకు వెళ్లి.. విధిరాతకు బలైన యువకుడు..

పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు