భూతప్పల స్పర్శ మహాద్భాగ్యం..బారులు తీరిన భక్తులు

అనంతపురం జిల్లాలో అత్యంత విశిష్టమైన వేడుక భూతప్పల ఉత్సవం. వారంరోజుల పాటు కొనసాగే ఈ ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. మడకశిర మండల పరిధిలోని భక్తరహళ్లి గ్రామంలో జరిగే ఈ ఉత్సవాలకు కర్నాటక, ఆంధ్ర ప్రాంతాలకు చెందిన వేలాది మంది భక్తులు తరలివచ్చారు. ఉదయాన్నే స్వామివారిని రంగు రంగుల పూలతో ప్రత్యేకంగా అలంకరించిన భూతప్పలు దేవతా ఉత్సవమూర్తులకు పూజలు నిర్వహించిన అనంతరం అర్చకుల ఇంటి నుంచి ఊరేగింపుగా ఆలయానికి తీసుకువచ్చారు. ఆ సమయంలో భూతప్పలు కాలినడకన […]

భూతప్పల స్పర్శ మహాద్భాగ్యం..బారులు తీరిన భక్తులు
Follow us

|

Updated on: Dec 14, 2019 | 12:00 PM

అనంతపురం జిల్లాలో అత్యంత విశిష్టమైన వేడుక భూతప్పల ఉత్సవం. వారంరోజుల పాటు కొనసాగే ఈ ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. మడకశిర మండల పరిధిలోని భక్తరహళ్లి గ్రామంలో జరిగే ఈ ఉత్సవాలకు కర్నాటక, ఆంధ్ర ప్రాంతాలకు చెందిన వేలాది మంది భక్తులు తరలివచ్చారు. ఉదయాన్నే స్వామివారిని రంగు రంగుల పూలతో ప్రత్యేకంగా అలంకరించిన భూతప్పలు దేవతా ఉత్సవమూర్తులకు పూజలు నిర్వహించిన అనంతరం అర్చకుల ఇంటి నుంచి ఊరేగింపుగా ఆలయానికి తీసుకువచ్చారు.

ఆ సమయంలో భూతప్పలు కాలినడకన అక్కడికి చేరుకుంటుండగా వారి పాద స్పర్శ కోసం వందలాది మంది భక్తులు ఉపవాస దీక్షతో తడి దుస్తులతో రహదారిపై పడుకొన్నారు. భూతప్పలు భక్తుల పై కత్తులు చేతబట్టి పళ్లు, వేపాకులు తింటూ నాట్యం చేశారు. భూతప్పల కాలిస్పర్శ తగిలితే అనుకున్న కోర్కేలు నెరవేరుతాయనే ఉద్దేశంతో భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. అనంతరం లక్ష్మీనరసింహాస్వామి విగ్రహాలను జిల్లెడగుంట గ్రామం వరకు ప్రత్యేకంగా అలంకరించిన రథంలో ఊరేగింపుగా తీసుకెళ్లారు. ప్రతి ఏటా నిర్వహించే ఈ భూతప్పల ఉత్సవానికి సంతానం లేనివారు, ధీర్ఘకాలిక రోగాలు ఉన్నవారు, కోరికలు నేరవేరడం కోసం భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భూతప్పల కాలిస్పర్శ కోసం పోటీపడతారు.