క్యాబ్ కావాలన్నాడు.. దారి మళ్లించి దాడి చేశాడు.. అంతే కాకుండా

ప్రస్తుత ఉరుకుల, పరుగుల జీవితంలో ప్రతి ఒక్కరూ బిజీ బిజీగా గడుపుతున్నారు. అవసరాలను తీర్చుకునేందుకు కొత్త కొత్త సౌకర్యాలు, సదుపాయాలూ అందుబాటులోకి వచ్చాయి. ఇలా వచ్చినవే బైక్ లు, క్యాబ్ లు. వీటి ద్వారా..

క్యాబ్ కావాలన్నాడు.. దారి మళ్లించి దాడి చేశాడు.. అంతే కాకుండా
Cab Biker Attack
Follow us

|

Updated on: Mar 07, 2022 | 6:28 AM

ప్రస్తుత ఉరుకుల, పరుగుల జీవితంలో ప్రతి ఒక్కరూ బిజీ బిజీగా గడుపుతున్నారు. అవసరాలను తీర్చుకునేందుకు కొత్త కొత్త సౌకర్యాలు, సదుపాయాలూ అందుబాటులోకి వచ్చాయి. ఇలా వచ్చినవే బైక్ లు, క్యాబ్ లు. వీటి ద్వారా ప్రయాణ అవసరాలు చాలా వరకు అందుబాటులోకి వచ్చాయి. కానీ కొంత మంది వీటి ద్వారానూ నేరాలకు పాల్పడడం గమనార్హం. విజయవాడలో సరిగ్గా ఇలాంటి ఘటన జరిగింది. క్యాబ్‌(Cab) కావాలని ఓ మొబైల్‌ యాప్‌లో బుక్‌ చేసుకున్నాడు. తీరా ఎక్కిన తర్వాత మార్గమధ్యంలో క్యాబ్‌ నిర్వాహకుడిని దారి మళ్లించారు. పథకం ప్రకారం మరో మిత్రుడితో కలిసి చోరీకి పాల్పడ్డారు. అనంతరం అతడిని గాయపరిచి పరారయ్యారు. ఈ ఘటపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. విజయవాడ(Vijayawada) కృష్ణలంక బాలాజీ నగర్‌కు చెందిన పృథ్వీరాజ్‌ డిగ్రీ పూర్తి చేశాడు. పార్ట్‌ టైంగా ర్యాపిడ్‌ బైక్‌ క్యాబ్‌ సర్వీసులో చేరాడు. శనివారం అర్ధరాత్రి 12 గంటలకు అతనికి ఓ బుకింగ్‌ వచ్చింది. దీంతో కస్టమర్‌ దగ్గరకు వెళ్లాడు. తనను గన్నవరం(Gannavaram) తీసుకెళ్లాలని కస్టమర్ కోరాడు. అతడి అభ్యర్థనను అంగీకరించిన పృథ్వీరాజ్.. కస్టమర్ ను బైక్ పై ఎక్కించుకున్నారు.

గన్నవరం సమీపంలోని కేసరపల్లి కూడలికి చేరుకోగా సావరగూడెం వైపునకు వెళ్లాలన్నాడు. అప్పటికే వేచిచూస్తున్న స్నేహితుడితో కలిసి పృథ్వీరాజ్‌పై దాడికి పాల్పడ్డాడు. పృథ్వీరాజ్‌ నుంచి ద్విచక్ర వాహనం, ఏటీఎమ్‌ కార్డు, సెల్‌ఫోన్‌, నగదు లాక్కొని పరారయ్యారు. తీవ్ర గాయాలైన పృథ్వీరాజ్‌ను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇవీ చదవండి.

Telangana CM KCR: కేసీఆర్ మదిలో ఆ ఆలోచన ఉందా?.. విపక్షాల ఉరుకులు పరుగులు అందుకోసమేనా?..

GST Rate Hike: జీఎస్టీ స్లాబ్‌ రేట్ల పెంపు.. కేంద్రానికి లక్షన్నర కోట్ల ఆదాయం..

Russia – Ukraine Crisis: ప్రపంచాన్ని హడలెత్తిస్తోన్న రష్యా ‘డెడ్‌ హ్యాండ్‌’.. ఇది ఎంత ప్రమాదకరమో తెలుసా?