APSRTC: ఆర్టీసీ ప్రయాణీకులకు గుడ్‌న్యూస్.. టికెట్ బుక్కింగ్‌లో బంపర్ ఆఫర్.. 30 కాదు 60 రోజుల ముందుగా..

ఏపీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్‌న్యూస్ చెప్పింది. దూరప్రాంతాలకు నడిచే ఆర్టీసీ బస్సులలో ముందస్తు (Advance) సీట్ల రిజర్వేషన్ వ్యవధి పెంపును ప్రకటించింది. ప్రస్తుతం అందిస్తున్న..

APSRTC: ఆర్టీసీ ప్రయాణీకులకు గుడ్‌న్యూస్.. టికెట్ బుక్కింగ్‌లో బంపర్ ఆఫర్.. 30 కాదు 60 రోజుల ముందుగా..
Apsrtc
Follow us

|

Updated on: Dec 01, 2021 | 7:44 PM

ఏపీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్‌న్యూస్ చెప్పింది. దూరప్రాంతాలకు నడిచే ఆర్టీసీ బస్సులలో ముందస్తు (Advance) సీట్ల రిజర్వేషన్ వ్యవధి పెంపును ప్రకటించింది. ప్రస్తుతం అందిస్తున్న రోజుల గడువు వ్యవధిని డబుల్ చేసింది. 30 రోజుల పరిమితిని 60 రోజుల వరకూ పెంచుతూ ప్రకటన చేసింది ఆర్టీసీ. క్రిస్టమస్, నూతన సంవత్సరం, సంక్రాంతి పర్వదినాల దృష్ట్యా ఆర్టీసీ ఈ నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్, బెంగుళూరు, చెన్నయ్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప, అనంతపురం వంటి దూర ప్రాంత బస్సులలో ఈ పరిమితి పెంపు. ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావు.

అయితే ఇప్పటికే పలు ఆఫర్లను ప్రకటించింది ఏపీఎస్ఆర్టీసీ. పట్టణ ప్రాంతాల్లో ఓ బస్టాండ్‌ నుంచి మరో బస్టాండ్‌ వరకు కొరియర్‌ కవర్లు, కార్గో పార్శిల్‌ సేవలు అందిస్తోంది. ఇకముందు గ్రామీణ ప్రాంతాలకు వీటిని విస్తరించేందుకు ప్లాన్ చేస్తోన్న సంగతి తెలిసింది. చిన్న పట్టణాలు, పల్లెలకు వెళ్లే బస్సుల్లోనూ కండక్టర్‌ ద్వారా కిలో లోపు బరువు ఉండే కవర్లు రవాణా చేసేందుకు సిద్దమవుతోంది.

ఇందులో భాగంగా ప్రస్తుతం కండక్టర్ల వద్ద ఉండే టికెట్ల జారీ మిషన్లను వాడబోతున్నారు. ఇందులోనే కొరియర్‌ బుక్‌చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. వీటికి స్వయంగా కండక్టర్ తన వద్ద ఉన్న రశీదు ఇస్తారు. వీటిని బుక్‌చేసుకున్న వారు.. దానిని అందజేయాల్సిన చిరునామాను కవరుపై రాసి సంబంధిత వ్యక్తులకు ఫోన్‌చేసి బస్సు వచ్చే సమయానికి సిద్ధంగా ఉండాలని చెప్పాలి. సదరు ఆ బస్టాప్‌లో కండక్టర్‌ వీటిని అందజేస్తారు.

ఇవి కూడా చదవండి: Car Accident: వ్యవసాయ బావిలో పడ్డ కారు.. సిద్దిపేట జిల్లా చిట్టాపూర్‌ దగ్గర ప్రమాదం.. కారులో ఎంత మంది ఉన్నారో..

Jaggery Tea: బెల్లం చాయ్ రోజుకు అన్నిసార్లు తాగుతున్నారా.. అయితే జాగ్రత్త.. ఎందుకో తెలుసా..

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.