AP Weather: ఏపీ ప్రజలకు అలెర్ట్.. రానున్న 48 గంటల్లో భారీ వర్షాలు.. ముఖ్యంగా ఈ ప్రాంతాల్లో

ఏలూరు జిల్లా కుక్కునూరు, వేలేరు పాడు ఇంకా వరద నీటినుంచి బయటపడలేదు. జల దిగ్బంధంలోనే ఈ మండలాలు చిక్కుకున్నాయి. వేలేరుపాడులో ఇళ్లు నీట మునిగాయి. రెండు వారాలుగా ఈ రెండు గ్రామాల ప్రజలు పునరావాస కేంద్రాల్లోనే తలదాచుకుంటున్నారు.

AP Weather: ఏపీ ప్రజలకు అలెర్ట్.. రానున్న 48 గంటల్లో భారీ వర్షాలు.. ముఖ్యంగా ఈ ప్రాంతాల్లో
Andhra Rains
Ram Naramaneni

|

Aug 14, 2022 | 12:55 PM

Andhra Rains: ఏపీ ప్రజలకు అలెర్ట్.  48 గంటల్లో భారీ వర్షాలు పడే అవకాశం. అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. అయితే ఇప్పటికే విశాఖ, శ్రీకాకుళంలో వాతావరణం మారింది. భారీ వర్షాలు పడుతున్నాయి. మరో గంటలో కుండపోత కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. వైజాగ్‌(Vizag)లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని వివరించింది. ఉత్తరాంధ్రతో పాటు రాజమండ్రి(Rajahmundry), ఏలూరు(Eluru)లో అతి భారీ వర్షాలు పడే ఛాన్స్‌ ఉంది. పాడేరు, పార్వతీపురంలో ఒక మోస్తరు నుంచి భారీ వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వివరించింది. ఏలూరు జిల్లా కుక్కునూరు, వేలేరు పాడు ఇంకా వరద నీటినుంచి బయటపడలేదు. జల దిగ్బంధంలోనే ఈ మండలాలు చిక్కుకున్నాయి. వేలేరుపాడులో ఇళ్లు నీట మునిగాయి. రెండు వారాలుగా ఈ రెండు గ్రామాల ప్రజలు పునరావాస కేంద్రాల్లోనే తలదాచుకుంటున్నారు. కుక్కునూరు ప్రాంతాల్లో మళ్లీ భారీ వర్షం కురుస్తుండడంతో ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందో అనే జనం భయపడుతున్నారు.

కోనసీమ జిల్లాలో పాములు బుసలు కొడుతున్నాయి. వరదలకు కొట్టుకువచ్చిన పాములు ఇళ్లలోకి చేరుతున్నాయి. అమలాపురంలోని ఓ ఇంట్లో కిచెన్‌లోకి అర్ధరాత్రి భారీ తాచుపాము దూరింది. భయంతో ఒక్కసారిగా ఇంట్లోని వారు బయటకు పరుగులు తీశారు. చివరకు స్నేక్‌క్యాచర్‌కు సమాచారం ఇవ్వడంతో అతని వచ్చి పామును పట్టుకున్నారు. వరదలతో లంక ప్రాంతాలు మునిగిపోవడంతో జనవాసాల్లోకి పాములు వస్తున్నాయని జనం అంటున్నారు.  భారీ వర్షాలతో కృష్ణా ప్రాజెక్టులకు జలకళ సంతరించుకున్నాయి. శ్రీశైలం ప్రాజెక్ట్‌కు భారీ వరద కొనసాగుతోంది.ప్రాజెక్టు పది గేట్లు ఎత్తివేశారు. దీంతో పర్యాటకుల సందడి పెరిగింది. తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర నుంచి టూరిస్టులు భారీగా తరలిస్తున్నారు.

ప్రస్తుతం శ్రీశైలంలోనికి ఇన్‌ఫ్లో 3,96,000 క్యూసెక్కులు ఉంటే…. ఔట్‌ఫ్లో 3,80,000 క్యూసెక్కులుగా ఉంది. ప్రస్తుతం ప్రాజెక్టు పూర్తిగా నిండింది. కుడి,ఎడమ జలవిద్యుత్‌ కేంద్రాల్లో విద్యుత్‌ ఉత్పత్తి కొనసాగుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో ప్రకాశం బ్యారేజి దగ్గర వరద పెరిగింది. దీంతో 70 గేట్లు ఎత్తివేశారు. ర్షాలు కొనసాగితే మరో రెండు రోజుల పాటు వరద కొనసాగుతుందని అధికారులు తెలిపారు. మరోవైపు వరుస సెలవులు కావడంతో బ్యారేజీ అందాలు చూసేందుకు పర్యాటకులు భారీగా తరలివస్తున్నారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu